పేరూరు మత్స్య సహకార సంఘానికి ఏకగ్రీవ పాలకవర్గం
నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్, హాలియా: అనుముల మండలం పేరూరు గ్రామంలోని మత్స్య సహకార సంఘం పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ సందర్భంగా బుయ్య పరమేష్ ముదిరాజ్ను సంఘం చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎలక్షన్ ఆఫీసర్ డి. సుమానంద్ అధ్యక్షతన ఆగస్టు 12న నిర్వహించిన కార్యక్రమంలో నూతన పాలకమండలి సభ్యులను ప్రకటించారు. చైర్మన్‌గా బుయ్య పరమేష్ ముదిరాజ్, వైస్ చైర్మన్‌గా గోపనబోయిన చిన్న పుల్లయ్య, కార్యదర్శిగా బైరు కొండల్ ఎన్నికైనట్లు ప్రకటించారు. డైరెక్టర్లుగా గోపనబోయిన లింగయ్య, జినకల రామాంజనేయులు, గోపనబోయిన సైదులు, రాయనబోయిన శంకర్, ఎడవల్లి పెద్ద మల్లయ్య, ఎస్‌కే అజ్గర్ ఎన్నికయ్యారు. మత్స్య సహకార సంఘం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు సొసైటీ సభ్యులు, గ్రామ ప్రజలు ఏకాభిప్రాయంతో ముందుకు సాగడం, ఈసారి కూడా పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సంఘం అభివృద్ధికి నూతన పాలకవర్గం సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.






