ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

గురువారం13 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 5:58 amసూర్యాస్తమయం 6:43 pm

గురువారం

13 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 5:58 am

సూర్యాస్తమయం 6:43 pm

SENSEX77,922-0.74%
NIFTY24,378-0.79%
హైదరాబాద్ 22K₹1,45,007/10g+1.47%
హైదరాబాద్ 24K₹1,58,189/10g+1.47%
వెండి₹2,14,235/kg-0.69%

తెలంగాణ వార్తలు

అర్ధగిరి క్షేత్ర సహాయ కార్యదర్శిగా బచ్చు సతీష్... ఘనంగా సన్మానించిన వాసవి క్లబ్

💥 అర్ధగిరి క్షేత్ర సహాయ కార్యదర్శిగా బచ్చు సతీష్... ఘనంగా సన్మానించిన వాసవి క్లబ్ 💥 నల్గొండ జిల్లా ఇంచరర్జ్ (విశ్వనాధ్): శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం, అర్ధగిరి క్షేత్రం (మల్లెగట్టు, కొండమల్లేపల్ల

Staff Reporter12 August 2026, 2:56 PM89 చూసులుtrinetnews.com
అర్ధగిరి క్షేత్ర సహాయ కార్యదర్శిగా బచ్చు సతీష్... ఘనంగా సన్మానించిన వాసవి క్లబ్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

నల్గొండ జిల్లా ఇన్‌చార్జ్ (విశ్వనాథ్): శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం, అర్ధగిరి క్షేత్రం (మల్లెగట్టు, కొండమల్లేపల్లి) శాశ్వత ట్రస్ట్ మెంబర్ మరియు సహాయ కార్యదర్శిగా బచ్చు సతీష్ గారు నియమితులయ్యారు. ఆధ్యాత్మిక సేవలో ఆయనకున్న అంకితభావాన్ని గుర్తిస్తూ ఆలయ కమిటీ ఈ బాధ్యతలు అప్పగించింది.

బచ్చు సతీష్ గారి నియామకాన్ని పురస్కరించుకుని ఆయనను అభినందిస్తూ హాలియా గ్రేటర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఒక ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హాలియా గ్రేటర్ వాసవి క్లబ్ అధ్యక్షులు కేశ శేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుక అత్యంత ఉత్సాహంగా జరిగింది. వేదికపై బచ్చు సతీష్ గారిని శాలువాతో సత్కరించి సన్మానించారు.

బచ్చు సతీష్ గారికి ఈ అరుదైన అవకాశం దక్కడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు మరియు స్నేహితులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి ఆయన మరింత విశేష కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కొండూరు శోభన్ బాబు, రీజియన్ చైర్మన్ గందె మహేష్, జోన్ చైర్మన్ గట్టు వెంకటేశ్వర్లు, అనుముల మండలం ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకన్న గారు, వాసవి క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి