అలరించిన ఎస్.పి. కోదండపాణి' సినీ సంగీత విభావరి
చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 23: వెన్నెల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 'బృందావనం' సుబ్రహ్మణ్యం సమర్పణలో "స్వర్ణయుగ సంగీత దర్శకులు ఎస్.పి. కోదండపాణి" శీర్షికతో సినీ సంగీత విభావరి చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ వద్దగల కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు.
వెన్నెల కల్చరల్ అసోసియేషన్ 'బృందావనం' సుబ్రహ్మణ్యం సమర్పణ వై.ఎస్. రామకృష్ణ, డాక్టర్ శంకర్, భాస్కర్, రవి ప్రసాద్‌లతో పాటు ప్రసిద్ధ గాయనీ, గాయకులు జగద్ధాత్రి, జ్యోతిర్మయి, కృష్ణవేణి, ఇందుశ్రీ తదితరులు పాల్గొని ఎస్.పి. కోదండపాణి గారి స్వరపరచిన అమర గీతాలను ఆలపించారు.








