శనివారం

8 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 5:57 am

సూర్యాస్తమయం 6:46 pm

ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

23°మేఘం కమ్ము

www.trinetnews.com

SENSEX78,499-0.18%
NIFTY24,571-0.82%
హైదరాబాద్ 22K₹1,43,809/10g+9.07%
హైదరాబాద్ 24K₹1,56,883/10g+9.07%
వెండి₹2,09,903/kg+10.11%

తెలంగాణ వార్తలు

దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన కేసీఆర్

దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆర్థిక సాయం ప్రకటించారు. పార్టీ తరఫున మొత్తం రూ. 2 కోట్ల 25 లక్షల సాయం అందించాలని నిర్ణయించారు. పెద్ది సుదర్శన

Staff Reporter8 August 2026, 4:06 PMtrinetnews.com
దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన కేసీఆర్

దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆర్థిక సాయం ప్రకటించారు. పార్టీ తరఫున మొత్తం రూ. 2 కోట్ల 25 లక్షల సాయం అందించాలని నిర్ణయించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయలు, వృద్ధాప్యంలో ఉన్న వారి తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ. 25 లక్షలు అందజేయనున్నారు. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పిల్లల భవిష్యత్తు, చదువు తదితర విషయాలపై పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తుందని భరోసా ఇచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మల కార్యక్రమాలు ముగిసిన తర్వాత జిల్లా ముఖ్యులు సమావేశమై కుటుంబ సంక్షేమానికి సంబంధించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటారని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

జీఎస్‌టీలో ఏఐ: చిరు వ్యాపారులకు ఇబ్బంది లేకుండా లీకేజీల నివారణ

జీఎస్‌టీలో ఏఐ: చిరు వ్యాపారులకు ఇబ్బంది లేకుండా లీకేజీల నివారణ

పన్ను వ్యవస్థలో కృత్రిమ మేధ(AI) వినియోగం పారదర్శకతను పెంచాలి తప్ప, నిబంధనలు పాటించే చిన్న వ్యాపారులను భయపెట్టేలా ఉండకూడదు.

మిగతా చదవండి →

పాఠశాల విద్యార్థులకు జానపద కళలపై శిక్షణ: బుర్రకథ, పేరిణి మెలకువలు నేర్చుకుంటున్న బాలలు

పాఠశాల విద్యార్థులకు జానపద కళలపై శిక్షణ: బుర్రకథ, పేరిణి మెలకువలు నేర్చుకుంటున్న బాలలు

తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు చేరవేసే లక్ష్యంతో నగరంలోని విద్యార్థులకు ప్రత్యేక జానపద కళల వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు.

మిగతా చదవండి →

హైదరాబాద్‌లో వైభవంగా తెలుగు సాహిత్య సదస్సు.. కొత్త కవితలు, అనువాదాలపై చర్చ

హైదరాబాద్‌లో వైభవంగా తెలుగు సాహిత్య సదస్సు.. కొత్త కవితలు, అనువాదాలపై చర్చ

నగరంలో జరిగిన తెలుగు సాహిత్య సదస్సులో నూతన కవితా ప్రక్రియలు, ఇతర భాషల నుంచి అనువాదాలపై ప్రముఖ కవులు, రచయితలు విస్తృతంగా చర్చించారు.

మిగతా చదవండి →