యువ రచయిత మురళీమోహన్ మోహన్ రాజు రచించిన " బతుకు బండి " కవితా సంపుటిని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి ఆవిష్కరించారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం హైదరాబాద్ చిక్కడపల్లి లోని త్యాగరాయ గానసభ నందు ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా డాక్టర్ సేవారత్న కొండూరు హరినారాయణకు అంకితం చేస్తూ పుస్తకావిష్కరణ జరిగింది. ఈసందర్భంగా మధుసూదనా చారి మాట్లాడుతూ మురళీమోహన్ రాజును నేను అన్నీ కోణాల్లో చూస్తున్నాను. కవిగా, రచయితగా, కళాకారుడిగా, సమాజ సేవకుడిగా ఒక్క మాటలో చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞాశాలియైన రాజు సేవలు సమాజానికి అవసరమని తెలిపారు. ఈకార్యక్రమంలో డాక్టర్ కొండూరు హరినారాయణ రెడ్డి, డాక్టర్ బూర్గుల మధుసూదనరావు, నిర్మలా ప్రభాకర్, ఎన్. వేణుగోపాల శర్మ, రచయిత దుబ్బా భాస్కర్ రావు, డాక్టర్ రాధ కుసుమ, రచయిత మురళీమోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
"బతుకు బండి" పుస్తకావిష్కరణ
Telangana Legislative Council Opposition Leader Sirikonda Madhusudhana Chary launched the poetry book 'Batuku Bandi' by young writer Muralimohan Mohan Raju.

ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఇవి కూడా చదవండి
రసరమ్యంగా భావికా రెడ్డి భరతనాట్య అరంగేట్ర ప్రదర్శన

Kumari K.R. Bhavika Reddy mesmerized audiences with her exceptional Bharatanatyam debut at Ravindra Bharathi, showcasing traditional classical pieces.
మిగతా చదవండి →ఘనంగా 'తుమ్ బిన్ జౌన్ కహా' ముహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్ యుగళగీతాల సంగీత విభావరి

A grand musical concert featuring legendary duet songs of Mohammed Rafi and Kishore Kumar was successfully held at Thyagaraya Gana Sabha in Chikkadpally.
మిగతా చదవండి →వరలక్ష్మి నూతన సాంస్కృతిక సంస్థ ప్రారంభోత్సవం

The inaugural event of the Sri Varalakshmi Cultural Organization featured a grand devotional music concert at Thyagaraya Gana Sabha.
మిగతా చదవండి →మయూరి నృత్యాలయం ఆధ్వర్యంలో ఘనంగా 'శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు'

Sri Mayuri Nrutyaalayam hosted grand Sri Krishna Janmashtami celebrations and cultural events at Thyagaraya Gana Sabha in Chikkadpally.
మిగతా చదవండి →