చిక్కడపల్లి, ట్రైనెట్ ఆగస్ట్ 12 :
ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని, ట్రాఫిక్ సిగ్నల్స్ పునరుద్ధరణకు ఉన్నతాధికారులతో మాట్లాడతానని ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్ స్థానికులకు హామీ ఇచ్చారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ప్రకృతి రెవ్యూ డ్రాప్స్ అపార్ట్మెంట్ ఆసోసియేషన్ వాసులు, సీనియర్ సిటిజన్స్ విజ్ఞప్తి మేరకు సమా వేశం నిర్వహించారు. క్రాస్ రోడ్డు ప్రాంతంలో ముషీ రాబాద్ ఎక్స్ రోడ్డు వైపు వెళ్లాలంటే గోల్కొండ డ్రాస్ రోడ్డు సమీపంలో మెట్రో స్టేషన్ వరకూ వెళ్లాల్సి వస్తుందని సీనియర్ సిటిజన్స్, అసోసియే షన్ సభ్యులు విన్నవించారు. ఈ ప్రాంతంలో భారీ షాపింగ్ కాంప్లెక్స్ లు, అపార్టుమెంట్లు, ఐమ్యాక్స్, సినిమా థియేటర్స్ వల్ల రద్దీ ఎక్కువగా ఉంటుంద ని, దీనిని పరిశీలించి ట్రాఫిక్ నియంత్రణకు
తగిన చర్యలు తీసుకోవాలని ఆయనకు విన్నవించారు. దీనిపై స్పందించిన ఆవినాష్ సమస్య పరి ష్కారానికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆడనపు డీసీపీ రాములు, ఏసీపీ ఎ.శ్రీనివాస్ కు చిక్క డపల్లి ట్రాఫిక్ సీఐ ఏడుకొండలు, ఆపార్ట్మెంట్ అసోసిషన్ సభ్యులు రాధాకృష్ణ, రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.





