వైద్య విజ్ఞాన శాస్త్రం లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎల్లాప్రగడ
హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, నవంబరు 20: వైద్య విజ్ఞాన రంగంలో ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందిన l డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు తెలుగు వారు కావటం తెలుగు జాతి యావత్తూ గర్వించే విషయం అని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కాశీవిశ్వేశ్వర్ రావు అన్నారు. త్యాగరాయగానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, త్యాగరాయ గానసభ సంయుక్త నిర్వహణలో ఎందరో మహానుభావులు మధుర స్మృతులలో' కార్యక్రమంలో భాగంగా డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు సంస్మరణ సభ అధ్యక్షుడు కళావిఎస్ జనార్దనముర్తి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ కాశీవిశ్వేశ్వర్ రావు మాట్లాడుతూ వైద్య పరిశోధనల ద్వారా మానవాళి ఆరోగ్యానికి విశేష సేవలందించిన మహనీయుల జీవిత చరిత్రలను భావితరాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అటువంటి వ్యక్తుల సేవలను స్మరించుకోవడం ద్వారా యువతలో పరిశోధనాత్మక దృక్పథం, సమాజానికి సేవ చేయాలనే తపన పెంపొందుతాయని పేర్కొన్నారు. సాహితికిరణం సంపాదకులు పోత్తూరి సుబ్బారావు, స్వర కిన్నెర చింతలపూడి త్రినాథరావు , గానసభ పాలకమండలి సభ్యుడు బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.








