బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,903+2.28%
NIFTY25,732+2.00%
22K₹1,12,812/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

వాహన ఫ్యాన్సీ నంబర్ల గడువు కుదింపు

వాహన ఫ్యాన్సీ నంబర్ల గడువు కుదింపు ఇకపై 60 రోజులు కాదు.. 30 రోజుల్లోనే దరఖాస్తు గడువు దాటితే ఆటోమేటిక్‌గా సాధారణ నంబర్ కేటాయింపు హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 19 : తెలంగాణలో వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు పొందాలనుకున

Sai Rapoluగురువారం, 19 నవంబర్ 2026 · 5:14 AM18 వీక్షణలుtrinetnews.com
వాహన ఫ్యాన్సీ నంబర్ల గడువు కుదింపు

వాహన ఫ్యాన్సీ నంబర్ల గడువు కుదింపు

ఇకపై 60 రోజులు కాదు.. 30 రోజుల్లోనే దరఖాస్తు

గడువు దాటితే ఆటోమేటిక్‌గా సాధారణ నంబర్ కేటాయింపు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 19 : తెలంగాణలో వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు పొందాలనుకునే వాహనదారులకు రాష్ట్ర రవాణా శాఖ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఫ్యాన్సీ నంబర్ల కోసం ఉన్న 60 రోజుల గడువును 30 రోజులకు కుదించింది. కొత్త వాహనం కొనుగోలు చేసిన తేదీ నుంచి 30 రోజుల్లోపు ఫ్యాన్సీ నంబర్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

నిర్ణీత గడువులోపు ఫ్యాన్సీ నంబర్ పొందేందుకు అవసరమైన ప్రక్రియ పూర్తి చేయకపోతే వాహన్ పోర్టల్ ద్వారా సాధారణ రిజిస్ట్రేషన్ నంబర్ ఆటోమేటిక్‌గా కేటాయించబడుతుంది. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు సమాచారం.

వాహన్ పోర్టల్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో తాత్కాలిక రిజిస్ట్రేషన్ గడువుకు అనుగుణంగా ఫ్యాన్సీ నంబర్ల దరఖాస్తు గడువును సవరించారు. ప్రత్యేక నంబర్లు కోరుకునే వాహనదారులు ఆలస్యం చేయకుండా నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. కొత్త నిబంధనల నేపథ్యంలో వాహన కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ముందుగానే అవగాహన కలిగి ఉండటం అవసరం.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →