వాసన్న ఆధ్వర్యంలో ఘనంగా పదిరోజుల గణేశ్ ఉత్సవాలు
భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన జేఎంఎఫ్‌ఏ సభ్యులు
ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 23: జేఎంఎఫ్‌ఏ ఆధ్వర్యంలో పదిరోజులపాటు నిర్వహించిన గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వాసన్న నేతృత్వంలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ గణపతికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు.
ఈ వేడుకల్లో జేఎంఎఫ్‌ఏ సభ్యులు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. సభ్యుల సమష్టి సహకారంతో పదిరోజుల ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్లు వాసన్న తెలిపారు.
ఫొటో క్యాప్షన్: వాసన్న ఆధ్వర్యంలో నిర్వహించిన పదిరోజుల గణేశ్ ఉత్సవాల్లో జేఎంఎఫ్‌ఏ సభ్యులు.







