సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX80,893+5.17%
NIFTY24,998+4.98%
22K₹1,32,473/10g+0.83%
భాషలు

తెలంగాణ వార్తలు

త్యాగరాయగానసభలో గ్రంథావిష్కరణలు, సంగీత కార్యక్రమాలు ఉచితం

గానసభలో గ్రంథావిష్కరణలు, సంగీత కార్యక్రమాలు ఉచితం : - రచయితలు, కళాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : - త్యాగరాయగానసభ అధ్యక్షుడు కళా జనార్థనమూర్తి వెల్లడి... హైదారాబాద్ , చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, నవంబరు 5

Staff Reporter5 November 2026, 5:47 AM8 చూసులుtrinetnews.com
త్యాగరాయగానసభలో గ్రంథావిష్కరణలు, సంగీత కార్యక్రమాలు ఉచితం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

*గానసభలో గ్రంథావిష్కరణలు, సంగీత కార్యక్రమాలు ఉచితం :*

- రచయితలు, కళాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి :

- త్యాగరాయగానసభ అధ్యక్షుడు కళా జనార్థనమూర్తి వెల్లడి...

హైదారాబాద్ , చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, నవంబరు 5: గ్రంథ ఆవిష్కర ణలు, సాహితీ సమావేశాలు, శాస్త్రీయ సంగీత కార్యక్రమాలను ఇకపై త్యాగరాయగానసభనే ఉచితంగా నిర్వహిస్తుందని గాన సభ అధ్యక్షుడు కళా జనార్థన మూర్తి తెలిపారు. ఈ మేరకు పాలకమండలిలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం చి క్కడపల్లిలోని త్యాగరాయగాన సభలో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. గతంలో వివిధ సంస్థల కు సాహితీ, శాస్త్రీయ సంగీత కా ర్యక్రమాలకు హాళ్లను ఉచితంగా ఇవ్వడం జరిగిందని గుర్తు చేశా రు. ఇకపై పుస్తకావిష్కరణ, శాస్త్రీ య సంగీత కార్యక్రమాలను తా మే స్వయంగా నిర్వహిస్తామన్నా రు. ఈ కార్యక్రమాలకు అయ్యే వ్యయం, బ్యానర్లు, ప్రచార ఖ ర్చులను కూడా గానసభనే భరి స్తుందని స్పష్టం చేశారు. రచయి తలు తమకు నచ్చిన అతిథుల ను ఎంచుకునే అవకాశం కల్పి స్తామని, వారు కోరిన సమయం లో అందుబాటులో ఉన్న హాల్ ను కేటా యిస్తామని తెలిపారు. రచయితలు, కళాకారులు ఈ వెసులుబాటును సద్వి నియోగం చేసుకోవాలని, త్యాగరాయ గాన సభ కార్యాలయంలో సంప్రదిం చాలని కోరారు. గానసభ పూర్వ అధ్యక్షుడు కళా సుబ్బారావు స్మృతికి నివాళిగా ఈ కార్యక్రమా ల ఖర్చులను భరిస్తూ నిర్వహిం చాలని నిర్ణయించినట్లు చెప్పా రు. గతంలో ఆయన పేరిట పేద లకు ఉచిత కళ్యాణ వేదికల పథ కాన్ని ప్రారంభించామని, గత మూడేళ్లుగా అది విజయవం తంగా అమలవుతోందని గుర్తు చేశారు. ఈ కా ర్యక్రమంలో కళా శారద దీక్షితులు, కళా రామచంద్ర మూర్తి, కళా మహాలక్ష్మీ, ఎస్ వి. శ్రీనివాస్, కళా పద్మజ నీలిమ, తళ్ళ పల్లి చక్రపాణి, భమిడి ఉష, కళా లలిత, గుండవారపు గీతా దేవి,బండి శ్రీనివాస్, బండి నాగజ్యోతి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

అంతర్జాతీయ ‘మిస్ అండ్ మిస్టర్ ప్లానెట్’ పోటీలకు ఇండియా, అమెరికా నేషనల్ డైరెక్టర్‌గా బిగ్‌బాస్ విజేత కౌశల్ మండ! భారతదేశం తరఫున ఈషాన్ యెల్డే, అశ్రిత నీలకంఠం.. అమెరికా తరఫున తన్వి పడాల ఎంపిక

అంతర్జాతీయ ‘మిస్ అండ్ మిస్టర్ ప్లానెట్’ పోటీలకు ఇండియా, అమెరికా నేషనల్ డైరెక్టర్‌గా బిగ్‌బాస్ విజేత కౌశల్ మండ! భారతదేశం తరఫున ఈషాన్ యెల్డే, అశ్రిత నీలకంఠం.. అమెరికా తరఫున తన్వి పడాల ఎంపిక

మిగతా చదవండి →

తెలంగాణ సంస్కృతి వైవిధ్యం ముందు తరాలకు అందించాలి సాహితీ అకాడమీ పూర్వ చైర్మన్ జూలూరి

తెలంగాణ సంస్కృతి వైవిధ్యం ముందు తరాలకు అందించాలి సాహితీ అకాడమీ పూర్వ చైర్మన్ జూలూరి

హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 7: తెలంగాణ సంస్కృతిలో వైవిధ్యం ఉందని బతుకమ్మ బోనాలు వంటి ప్రత్యేకత లు ఉన్నాయని వాటిని ముందు తరాలకు అందించాలనీ సాహిత్య అకాడమీ పూర్వ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ చెప్పారు శ్రీ త

మిగతా చదవండి →