ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎలాంటి సిఫారస్సు లేఖలు స్వీకరించబడవు
తిరుమల, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున శ్రీవారి దర్శనం, వసతి కోసం తిరుమలలో ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని మంగళవారం టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది.
స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం, వసతి కల్పించడం జరుగుతుందని తెలిపింది.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ( ఎన్నికల ప్రవర్తనా నియమావళి ) ఉన్నంత వరకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది.



