Wednesday21 October 2026హైదరాబాద్

SENSEX73,571+1.08%
NIFTY22,730+0.47%
HYD 22K₹1,34,648/10g-0.95%
भाषाएँ

Telangana

भव्य रूप से संपन्न हुए श्रीवारी नवरात्रि ब्रह्मोत्सव.. जल्द ही एसवी म्यूजियम होगा शुरू: टीडीपी चेयरमैन बीआर नायडू

भव्य रूप से संपन्न हुए श्रीवारी नवरात्रि ब्रह्मोत्सव.. भक्तों को मिली विशेष सेवाएं, टीटीडी चेयरमैन बीआर नायडू का बयान.. जल्द ही भक्तों के लिए उपलब्ध होगा एसवी म्यूजियम।

Staff Reporter21 October 2026, 4:18 AM4 व्यूtrinetnews.com
भव्य रूप से संपन्न हुए श्रीवारी नवरात्रि ब्रह्मोत्सव.. जल्द ही एसवी म्यूजियम होगा शुरू: टीडीपी चेयरमैन बीआर नायडू

Share this story

Share link keeps your language (?lang=)

ఘనంగా ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు విశేష సేవలు

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడి.. త్వరలో భక్తులకు అందుబాటులోకి ఎస్వీ మ్యూజియం**

తిరుమల, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, విజయవంతంగా ముగిశాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల విజయానికి కృషి చేసిన అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు, పోలీసు, విజిలెన్స్ సిబ్బంది సహా ప్రతి ఒక్కరికీ టీటీడీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. బ్రహ్మోత్సవాల విజయవంతమైన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ నాయుడు మాట్లాడుతూ, ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయని చెప్పారు. అద్భుతమైన విద్యుత్ అలంకరణలు రూపొందించిన ఉద్యోగులను అభినందించారు. భారీ వర్షాల కారణంగా కొంత ఇబ్బంది ఎదురైనా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారి వాహనసేవలను దర్శించుకున్నారని తెలిపారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అధికారులు, సిబ్బంది భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించారని ప్రశంసించారు.

భక్తుల రాకతో కళకళలాడిన తిరుమల

గడిచిన ఎనిమిది రోజుల్లో 6.46 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని బీఆర్ నాయుడు వెల్లడించారు. భక్తులు హుండీ ద్వారా రూ.25.79 కోట్ల కానుకలను సమర్పించగా, 22.60 లక్షల మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. 2.44 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, 34.34 లక్షల లడ్డూలను విక్రయించినట్లు పేర్కొన్నారు.

గరుడసేవ రోజున భారీ వర్షం కురిసినప్పటికీ భక్తులకు నిరంతరాయంగా సేవలు అందించామని చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రవాణా, వైద్య, భద్రత, పారిశుద్ధ్య ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించినట్లు వివరించారు.

6,777 మంది కళాకారుల ప్రదర్శనలు

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేశంలోని 26 రాష్ట్రాలతో పాటు ఖతర్, దుబాయ్ నుంచి వచ్చిన మొత్తం 6,777 మంది కళాకారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ప్రతిరోజూ ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చిన నాలుగు కళాబృందాలను గుర్తించి టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర సత్కరించినట్లు బీఆర్ నాయుడు తెలిపారు.

తిరుమలలో 60 టన్నుల సంప్రదాయ పుష్పాలు, ఐదు లక్షల కట్‌ ఫ్లవర్స్‌తో ప్రత్యేక అలంకరణలు చేపట్టినట్లు వెల్లడించారు. వాహనసేవలను భక్తులు సులభంగా వీక్షించేందుకు 36 భారీ డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

రవాణా, వైద్య సేవలకు ప్రత్యేక ఏర్పాట్లు

భక్తుల సౌకర్యార్థం 39 ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా తిరుమలలో సుమారు ఏడు లక్షల మంది భక్తులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించినట్లు చైర్మన్ తెలిపారు. 4,500 మంది శ్రీవారి సేవకులు భక్తులకు విశేష సేవలందించారని చెప్పారు.

వైద్య సేవల కోసం 75 మంది వైద్యులు, 20 అంబులెన్సులను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా 2,800 మంది పోలీసులతో పాటు 2,000 మంది విజిలెన్స్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. గరుడసేవ రోజున పారిశుద్ధ్య నిర్వహణ కోసం 3,500 మంది సిబ్బంది సేవలందించారని పేర్కొన్నారు.

త్వరలో భక్తులకు ఎస్వీ మ్యూజియం

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల విజయానికి సమష్టి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భక్తులకు మరిన్ని ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుభూతులను అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో భాగంగా త్వరలో ఎస్వీ మ్యూజియాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు** వెల్లడించారు. భక్తుల సహకారం, అధికారుల సమన్వయం, సిబ్బంది అంకితభావంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని ఆయన పేర్కొన్నారు.

यह भी पढ़ें

वैभवपूर्वक संपन्न हुआ श्रीवारी का चक्रस्नान

वैभवपूर्वक संपन्न हुआ श्रीवारी का चक्रस्नान

वैभवपूर्वक संपन्न हुआ श्रीवारी का चक्रस्नान, चक्रधारी का दिव्य स्नान। पुष्करिणी में हज़ारों भक्तों ने किए पवित्र स्नान। लोक कल्याण और समस्त जीव-जंतुओं की भलाई के लिए पवित्र अवभृथ स्नान। तिरुपति, ट्रिनेट न्यूज़, 20 अक्टूबर:

और पढ़ें →

घट रहा है भूजल स्तर.. राज्य में चिंताजनक स्थिति

(स्टोरी) घट रहा है भूजल स्तर, राज्य में चिंताजनक स्थिति। पिछले वर्ष की तुलना में जल स्तर औसतन 5 मीटर नीचे गिरा, बढ़ रहा है पानी का उपयोग.. हैदराबाद, ट्रेनेट न्यूज, अक्टूबर 20 : राज्य में भूजल की स्थिति चिंताजनक बनी हुई है।

और पढ़ें →

दुर्गम्मा के दर्शन किए आंध्र प्रदेश के राज्यपाल जस्टिस अब्दुल नजीर ने

दुर्गम्मा के दर्शन किए आंध्र प्रदेश के राज्यपाल जस्टिस अब्दुल नजीर ने

दुर्गम्मा के दर्शन किए आंध्र प्रदेश के राज्यपाल जस्टिस अब्दुल नजीर ने अमरावती, ट्राइनेट न्यूज़, 20 अक्टूबर: इंद्रकीलाद्री पर विराजमान श्री कनकादुर्गम्मा के दर्शन आंध्र प्रदेश राज्य के राज्यपाल जस्टिस अब्दुल नजीर ने किए। म

और पढ़ें →