Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,37,653/10g-0.34%
भाषाएँ

Telangana

तिरुपति में भव्य रूप से संपन्न हुआ स्नपन तिरुమంजनम

Snapana Thirumanjanam for Lord Malayappa Swami and His consorts was held with spiritual grandeur in Tirumala, adorned with white pearls, vetiver, and divine floral garlands.

Staff Reporter21 September 2026, 4:18 PM4 व्यूtrinetnews.com
तिरुपति में भव्य रूप से संपन्न हुआ स्नपन तिरुమంजनम

Share this story

Share link keeps your language (?lang=)

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం

దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం

వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ

తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి సోమవారం స్నపన తిరుమంజనం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరు, డ్రై ఫ్రూట్స్, గాజులు, వక్క ఆకులు తదితరాలతో రూపొందించిన విశేష మాలల మధ్య స్వామి, అమ్మవార్లు దివ్య అలంకారంలో భక్తులను అనుగ్రహించారు.

తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు అర్చకస్వాములు వేదమంత్రోచ్ఛారణల నడుమ వైఖానస ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులను చేసి రంగురంగుల పుష్పాలతో సుందరంగా అలంకరించారు.

పంచామృతాలతో పవిత్ర అభిషేకం

ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, పసుపు, గంధంతో విశేష అభిషేకం చేశారు. శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో శాస్త్రోక్తంగా స్నపనం నిర్వహించారు.

వేద ఘోషతో మార్మోగిన రంగనాయకుల మండపం

స్నపన తిరుమంజనం సందర్భంగా టీటీడీ వేద పారాయణదారులు ఉపనిషత్ మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం తదితర పంచసూక్తాలను భక్తిభావంతో పారాయణం చేశారు. అభిషేకానంతరం తిరుమల పెద్ద జీయ్యంగార్, చిన్మ జీయ్యంగార్లు వివిధ దివ్య పాశురాలను పఠించారు.

సుగంధ పరిమళాల మధ్య దివ్య అలంకారం

ఈ వేడుకలో భాగంగా తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరు, డ్రై ఫ్రూట్స్, గాజులు, వక్క ఆకులు, పసుపు రేకులు, రోజాలు, బటన్ చామంతి మాలలతో స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. సుగంధ పరిమళాలు, పుష్పాల సౌరభం, వేదఘోషలు, భక్తిభావంతో రంగనాయకుల మండపం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

सुशीला द्वारा स्थापित कलाकारों के कल्याणकारी ट्रस्ट को आर्थिक सहायता। हैदराबाद, चिक्कडपल्ली, ट्राइनेट न्यूज, 6 अक्टूबर: प्रख्यात गायिका पी. सुशीला द्वारा कलाकारों के कल्याण के लिए स्थापित ट्रस्ट को तेलंगाना सरकार ने पचास लाख रुपये की वित्तीय सहायता...

और पढ़ें →

परिवार के सदस्यों की उपस्थिति में डॉक्टर तेन्नेटी सुधा देवी की 75वीं जयंती मनाई गई

परिवार के सदस्यों की उपस्थिति में डॉक्टर तेन्नेटी सुधा देवी की 75वीं जयंती मनाई गई

राज्य उपभोक्ता विवाद निवारण आयोग की चेयरपर्सन जस्टिस राधा रानी ने कहा कि परिवार के सभी सदस्यों का अंत तक एक साथ रहना बड़े माता-पिता को एक महान अनुभूति देता है।

और पढ़ें →