బుధవారం21 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX73,736+1.31%
NIFTY22,796+0.77%
22K₹1,34,327/10g-1.19%
భాషలు

తెలంగాణ వార్తలు

సాహిల్ ఫుడ్స్ యూనిట్లపై ‘టీజీ సేఫ్’ దాడులు.. 4 లైసెన్సులు సస్పెండ్

సాహిల్ ఫుడ్స్ యూనిట్స్ “టీజీ సేఫ్” దాడులు హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: నగరంలో సాహిల్ ఫుడ్స్ యూనిట్లపై టీజీ సేఫ్ అధికారులు దాడులు చేశారు. కాటేదాన్ సమీపంలోని ప్రేమావతిపేటలో సాహిల్ ఫుడ్స్క చెందిన 5 తయారీ యూనిట్ల

Staff Reporter21 October 2026, 4:10 AM2 చూసులుtrinetnews.com
సాహిల్ ఫుడ్స్ యూనిట్లపై ‘టీజీ సేఫ్’ దాడులు.. 4 లైసెన్సులు సస్పెండ్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

సాహిల్ ఫుడ్స్ యూనిట్స్ “టీజీ సేఫ్” దాడులు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: నగరంలో సాహిల్ ఫుడ్స్ యూనిట్లపై టీజీ సేఫ్ అధికారులు దాడులు చేశారు. కాటేదాన్ సమీపంలోని ప్రేమావతిపేటలో సాహిల్ ఫుడ్స్క చెందిన 5 తయారీ యూనిట్లలో తనిఖీలు చేపట్టారు. ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై 4 యూనిట్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్లు, రిజిస్ట్రేషన్లను అధికారులు సస్పెండ్ చేశారు. ఆయా యూనిట్లలో కార్యకలాపాలు ఆపేయాలని అధికారులను ఆదేశించారు. స్నాక్స్ తయారీ కేంద్రాల్లో పేరుకుపోయిన ఆహార వ్యర్థాలు, యంత్రాల నిర్వహణలో నిర్లక్ష్యం, సరైన వెంటిలేషన్ లేకపోవడాన్ని గుర్తించారు. ఆహార పదార్థాల్లో కల్తీ అనుమానంతో 11 నమూనాలను అధికారులు సేకరించారు. నిబంధనలకు విరుద్ధమైన లేబులింగ్తో ఉన్న 55 టన్నుల ఆహార పదార్థాలను సీజ్ చేశారు. సీజ్ చేసిన ఆహార పదార్థాల విలువ రూ.33.94 లక్షలు ఉంటుందని అంచనా. ఆహార పదార్థాలను నేల పైనే నిల్వ చేసినట్లు, వివిధ పదార్థాల తయారీ సమయంలో అక్కడి సిబ్బంది గుట్కా, పాన్ మసాలా నములుతున్నట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

వైభవోపేతంగా శ్రీవారి చక్రస్నానం

వైభవోపేతంగా శ్రీవారి చక్రస్నానం

వైభవోపేతంగా శ్రీవారి చక్రస్నానం చక్రధారుడి దివ్యస్నానం.. పుష్కరిణిలో వేలాది మంది భక్తుల పుణ్యస్నానాలు లోకక్షేమం, సకల జీవరాశుల శ్రేయస్సు కోసం పవిత్ర అవభృథ స్నానం తిరుమల, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: శ్రీవేంకటేశ్వరస్వామివ

మిగతా చదవండి →

తెలంగాణ రక్షణ సేన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్

తెలంగాణ రక్షణ సేన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్

తెలంగాణ రక్షణ సేన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అధ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ వరంగల్ - ఖమ్మం - నల్గొండ స్థానం నుంచి అభ్యర్థిగా ఖరారు దసరా సందర్భంగా ప్రకటించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఎన్నికల కో ఆర్డినేటర్, అబ్జర

మిగతా చదవండి →

అడుగంటుతున్న భూగర్భజలాలు.. రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు

(స్టోరీ) అడుగంటుతున్న భూగర్భజలాలు రాష్ట్రంలో ఆందోళనకరపరిస్థితులు గతేడాదితో పోలిస్తే సగటున 5 మీటర్ల లోతుకు పడిపోయిన నీటి మట్టాలు పెరుగుతున్న నీటి వినియోగం.. హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20 : రాష్ట్రంలో భూగర్భ జలాల

మిగతా చదవండి →

భారత్‌లోనూ ప్రభుత్వ మార్పు కుట్రలు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

భారత్‌లోనూ ప్రభుత్వ మార్పు కుట్రలు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

భారత్‌లోనూ ప్రభుత్వ మార్పు కుట్రలు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: భారత్‌లోనూ ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత

మిగతా చదవండి →