తెలంగాణ రక్షణ సేన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అధ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్
వరంగల్ - ఖమ్మం - నల్గొండ స్థానం నుంచి అభ్యర్థిగా ఖరారు*
దసరా సందర్భంగా ప్రకటించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత*
ఎన్నికల కో ఆర్డినేటర్, అబ్జర్వర్ గా సయ్యద్ ఇస్మాయిల్
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: వరంగల్ - ఖమ్మం - నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ ను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దసరా పండుగ శుభ ముహూర్తాన పార్టీ తరపున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే మొదటి అభ్యర్థిగా శ్రీకాంత్ గౌడ్ ను కవిత ఖరారు చేశారు. వరంగల్ - ఖమ్మం - నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కో ఆర్డినేషన్ కోసం స్టేట్ పార్టీ అబ్జర్వర్ గా సీనియర్ నాయకుడు సయ్యద్ ఇస్మాయిల్ ను నియమించారు. తెలంగాణ జాగృతిలో మొదటి నుంచి కల్వకుంట్ల కవిత వెన్నంటి నడిచారు శ్రీకాంత్.. పార్టీ అధికార ప్రతినిధిగా టీవీ చానెల్స్ డిబేట్లలో, ప్రజా సంఘాల సమావేశాల్లో పార్టీ గొంతుకగా నిలిచారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ స్థాపించిన తర్వాత మొదటిసారి శాసన మండలి ఎన్నికల బరిలో పార్టీ అభ్యర్థులను కవిత రంగంలోకి దించుతున్నారు. పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే మొదటి అభ్యర్థిగా అధికారికంగా శ్రీకాంత్ గౌడ్ పేరు ప్రకటించారు.




