Wednesday21 October 2026హైదరాబాద్

SENSEX73,392+0.84%
NIFTY22,666+0.19%
HYD 22K₹1,34,509/10g-0.99%
भाषाएँ

Telangana

घट रहा है भूजल स्तर.. राज्य में चिंताजनक स्थिति

(स्टोरी) घट रहा है भूजल स्तर, राज्य में चिंताजनक स्थिति। पिछले वर्ष की तुलना में जल स्तर औसतन 5 मीटर नीचे गिरा, बढ़ रहा है पानी का उपयोग.. हैदराबाद, ट्रेनेट न्यूज, अक्टूबर 20 : राज्य में भूजल की स्थिति चिंताजनक बनी हुई है।

Staff Reporter21 October 2026, 4:15 AM5 व्यूtrinetnews.com

Share this story

Share link keeps your language (?lang=)

(స్టోరీ)

అడుగంటుతున్న భూగర్భజలాలు

రాష్ట్రంలో ఆందోళనకరపరిస్థితులు

గతేడాదితో పోలిస్తే సగటున 5

మీటర్ల లోతుకు పడిపోయిన నీటి మట్టాలు

పెరుగుతున్న నీటి వినియోగం..

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20 : రాష్ట్రంలో భూగర్భ జలాల పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఒకవైపు పెరుగుతున్న జనాభా, మరోవైపు విస్తరిస్తున్న పట్టణీకరణ, వ్యవసాయ అవసరాలతో భూగర్భ జలాల వినియోగం గణనీయంగా పెరుగుతున్నది. దీనికి తోడు వర్షపాతం, భూమిలోకి ఇంకే నీటి పరిమాణం, భూగర్భ జలాల వినియోగం మధ్య సమతుల్యత దెబ్బతిని నీటిమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గిందని భూగర్భ జల వనరుల శాఖ నివేదిక వెల్లడిస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ,

మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్నది. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో సగటున 5 మీటర్ల మేర భూగర్భజలాల మట్టం పడిపోయినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. నీటి వనరుల సంరక్షణ, భూగర్భజలాల పునరుద్ధరణపై ప్రభుత్వం తక్షణ దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితి స్పష్టం చేస్తున్నది.

నగరాల్లో నానాటికీ

తగ్గుతున్న జలాలు

రాష్ట్రంలో భూగర్భ జలాలు తగ్గుతున్న ప్రాంతాల్లో గ్రేటర్ హైదరాబాద్ ముందు వరుసలో ఉన్నది. జనాభా పెరుగుదలతో పాటు నివాస సముదాయాలు, వాణిజ్య భవనాలు, పరిశ్రమలు విస్తరిస్తుండడం తో నీటి అవసరాలు పెరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు బోరు బావులపైనే ఆధారపడాల్సి వస్తున్నది. జలాలను తోడిపోస్తున్న వేగానికి అనుగుణంగా భూమిలోకి నీరు ఇంకే పరిస్థితి లేదు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు.

జలమట్టాలు పెరగలేదు. దీంతో వేగంగా భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి.

భూగర్భ జలాల లెక్కలు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూగర్భజలాల నీటిమట్టం 3.57 మీటర్ల నుంచి 10.01 మీటర్లకు పడిపోయింది. సుమారు 6.44 మీటర్లు లోతుగా నమోదైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 6.29 మీటర్లు, వికారాబాద్ జిల్లాలో 6.17 మీటర్ల లోతులో నీటిమ ట్టాలు ఉన్నట్లు అధికారులు పేర్కొం టున్నారు. మరోవైపు, నల్గొండ, సంగా రెడ్డి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో నీరు 8 నుంచి 12 మీటర్ల లోతుకు చేరినట్లు సమాచారం. ప్రాంతాలవారీగా నీటి మట్టాల్లో వ్యత్యాసాలు ఉండడం, ఒకే జిల్లాలో కొన్ని చోట్ల పరిస్థితి మెరుగ్గా ఉండగా మరికొన్ని చోట్ల దిగజారడం గమనించాల్సిన అంశం. అదే విధంగా మహబూబ్ నగర్, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 9 నుండి 13 మీటర్ల లోతుకు పడిపోయిన మట్టాలు పడిపో యాయి. నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో 8 నుంచి 12 మీటర్ల లోతుకు, ఖమ్మం, సూర్యాపేట, పెద్దపల్లి, జగిత్యాల వంటి కెనాల్ ఆయకట్టు ఉన్న జిల్లాల్లో 4 నుంచి 7 మీటర్ల లోతులోనే లభ్యమవుతున్నట్లు అధికారులు తెలిపారు. 10 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు వెళ్లిన ప్రాంతాలు ప్రమాదకర కేటగిరీలోకి చేరినట్లు అధికారులు తెలిపారు.

భూమిలోకి ఇంకేదెంత?

పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, కాంక్రీట్ నిర్మా ణాలు, పేవ్మెంట్లు పెరగడంతో వర్షపు నీరు నేరుగా భూమిలోకి ఇంకే అవకాశా లు తగ్గుతున్నాయి. చెరువులు, కుంటలు, నాలాలు, సహజ నీటి ప్రవాహ మార్గాలు ఆక్రమణలకు గురికావడం లేదా వాటి నిల్వ సామర్థ్యం తగ్గడం కూడా నీటి ని ర్వహణపై ప్రభావం చూపుతున్నది. హైదరాబాద్ లో భూగర్భ జలాల తగ్గుదలకు వర్షపాతం లోటుతోపాటు వర్షపు నీటిని సమర్థంగా భూమిలోకి ఇంకించలేక పోవడం, పట్టణీకరణ వంటి అంశాలు కారణమవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

బోర్లు విఫలమైతే పరిస్థితి ఏంటి?

భూగర్భ జలాలు మరింత లోతుకు వెళ్లడం వల్ల గృహాలు, అపార్ట్మెంట్లు, చిన్న పరిశ్రమలు, వ్యవసాయ బోర్లపై ఆధారపడే కుటుంబాలపై ప్రభావం పడే అవకాశం ఉన్నది. నీటిమట్టం తగ్గిన కొద్దీ కొన్ని బోర్లలో సరఫరా తగ్గవచ్చు. మరికొన్ని బోర్లు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. కొత్త బోర్లు వేయడం, ఇప్పటికే ఉన్న బోర్లను మరింత లోతుకు తీసుకెళ్లడం వంటి చర్యలతో కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతున్నది.

వ్యవసాయ రంగంపై ప్రభావం

వ్యవసాయ రంగంలోనూ నీటి లభ్యత కీలకం. సాగు అవసరాలకు భూగర్భ జలాలపై అధికంగా ఆధారపడే ప్రాం తాల్లో నీటిమట్టాలు తగ్గితే పంటల సాగు ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. బోర్ల నిర్వహణకు విద్యుత్ వినియోగం పెరగడం, నీటిని పైకి తోడేందుకు ఎక్కువ శ్రమ అవసరం కావడం రైతులకు అదనపు భారంగా మారను న్నది. అయితే, ఈ ప్రభావాల తీవ్రత స్థానిక భౌగోళిక పరిస్థితులు, బోర్ల లోతు, పంటల రకం, ప్రత్యామ్నాయ నీటి వనరుల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. 2. రాష్ట్రంలో ఉన్న 53,685 జల వనరుల్లో 53,244 జల వనరులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి.

ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్

రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు డేంజర్ బెల్ మోగిస్తున్నాయి. గతేడాది కంటే తక్కువ నీటి మట్టం ఉన్నది. ఎల్న్ని ఎఫెక్ట్ రాష్ట్రంపై స్పష్టమైన ప్రభావం చూపుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 215.81 టీఎంసీ లకు గాను 64.42 టీఎంసీలు మాత్రమే ఉన్నది. గతేడాది ఇదే సమయానికి 207.85 టీఎంసీలు ఉన్నాయి. నాగార్జున సాగర్లో 312.03 టీఎంసీలకు గాను 189.16టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. గతేడాది 310.85 టీఎంసీలు ఉన్నాయి. సింగూరు ప్రాజెక్టులో 29.91 టీఎంసీలకు 3.46 టీఎంసీలే ప్రస్తుతం ఉండగా, గతేడాది 16.62 టీఎంసీల నీరు ఉన్నది. అదే విధంగా నిజాంసాగర్ ప్రాజెక్టులో 17.80 టీఎంసీలకు 10.50 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. గతేడాది పూర్తిస్థాయి నీటి మట్టం ఉన్నది. శ్రీరాం సాగర్లో సైతం 80.50 టీఎంసీలకు 41.42 టీఎంసీల నీరు ఉన్నది. గతేడాది పూర్తిస్థాయిలో నీరు కనిపించింది. మిడ్ మానేరులో 27.55 టీఎంసీలకు 23.44 టీఎంసీలు, లోయర్ మానేరులో 24.03 టీఎంసీలకు 15.45 టీఎంసీలు, కడెం ప్రాజెక్టులో 3.50 టీఎంసీలకు 2.97 టీఎంసీలు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్లులో 20.18 టీఎంసీలకు 18.20 టీఎంసీలు ఉన్నాయి. గతేడాది అక్టో బర్ 15 నాటికి 20.18 టీఎంసీలు ఉన్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు ఇంకా లోతుకు వెళ్లే పరిస్థితి ఉన్నదని అధికారులు పేర్కొంటున్నారు.

यह भी पढ़ें

वैभवपूर्वक संपन्न हुआ श्रीवारी का चक्रस्नान

वैभवपूर्वक संपन्न हुआ श्रीवारी का चक्रस्नान

वैभवपूर्वक संपन्न हुआ श्रीवारी का चक्रस्नान, चक्रधारी का दिव्य स्नान। पुष्करिणी में हज़ारों भक्तों ने किए पवित्र स्नान। लोक कल्याण और समस्त जीव-जंतुओं की भलाई के लिए पवित्र अवभृथ स्नान। तिरुपति, ट्रिनेट न्यूज़, 20 अक्टूबर:

और पढ़ें →

तेलंगाना रक्षक सेना के ग्रेजुएट एमएलसी उम्मीदवार के रूप में डॉ. नलामासा श्रीकांत गौड़

तेलंगाना रक्षक सेना के ग्रेजुएट एमएलसी उम्मीदवार के रूप में डॉ. नलामासा श्रीकांत गौड़

वारंगल-खम्मम-नलगोंडा सीट से तेलंगाना रक्षक सेना के ग्रेजुएट एमएलसी उम्मीदवार के रूप में डॉ. नलामासा श्रीकांत गौड़ तय दशहरा के अवसर पर पार्टी प्रमुख कलवाकुंतला कविता ने की घोषणा चुनाव समन्वयक और ऑब्जर्वर के रूप में सैयद इस्माइल

और पढ़ें →

दुर्गम्मा के दर्शन किए आंध्र प्रदेश के राज्यपाल जस्टिस अब्दुल नजीर ने

दुर्गम्मा के दर्शन किए आंध्र प्रदेश के राज्यपाल जस्टिस अब्दुल नजीर ने

दुर्गम्मा के दर्शन किए आंध्र प्रदेश के राज्यपाल जस्टिस अब्दुल नजीर ने अमरावती, ट्राइनेट न्यूज़, 20 अक्टूबर: इंद्रकीलाद्री पर विराजमान श्री कनकादुर्गम्मा के दर्शन आंध्र प्रदेश राज्य के राज्यपाल जस्टिस अब्दुल नजीर ने किए। म

और पढ़ें →