Monday12 October 2026హైదరాబాద్

SENSEX71,772-1.77%
NIFTY22,320-2.00%
HYD 22K₹1,37,979/10g+1.38%
भाषाएँ

Telangana

श्रमजीवियों की समस्याओं का समाधान ही टीबीजीकेएस का लक्ष्य: ऐली श्रीनिवास

श्रमजीवियों की समस्याओं का समाधान ही टीबीजीकेएस का लक्ष्य है: ओसीपी-3 नई पिट कमेटी परिचय कार्यक्रम में ऐली श्रीनिवास गोदावरीखानी, 11 अक्टूबर (ट्रैनेट न्यूज)

Staff Reporter11 October 2026, 5:19 AM49 व्यूtrinetnews.com
श्रमजीवियों की समस्याओं का समाधान ही टीबीजीकेएस का लक्ष्य: ऐली श्रीनिवास

Share this story

Share link keeps your language (?lang=)

కార్మికుల సమస్యల పరిష్కారమే టీబీజీకేఎస్ లక్ష్యం

ఓసీపీ–3 నూతన పిట్ కమిటీ పరిచయ కార్యక్రమంలో ఐలి శ్రీనివాస్

గోదావరిఖని, అక్టోబరు 11 (ట్రైనెట్ న్యూస్): కార్మికుల సమస్యల పరిష్కారమే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) లక్ష్యమని ఆర్జీ–2 ఏరియా ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ అన్నారు. ఓసీపీ–3లో నూతనంగా ఎన్నికైన పిట్ కమిటీ సభ్యులు, పిట్ కార్యదర్శులు, సంఘం నాయకులను ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉదయ్ హరిజన్‌కు పరిచయం చేశారు. కమిటీ సభ్యుల పేర్లు, పదవులను ఒక్కొక్కరిగా వివరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, ప్రాజెక్ట్ ఆఫీసర్ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఐలి శ్రీనివాస్ మాట్లాడుతూ.. టీబీజీకేఎస్ ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని చెప్పారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి, మనుగడకు సంఘం సహకరిస్తుందని పేర్కొన్నారు. గతంలో గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో కార్మికులకు అనేక హక్కులు సాధించడంతోపాటు, బొగ్గు ఉత్పత్తి, లాభాల్లో సింగరేణి అగ్రస్థానంలో నిలిచేందుకు తమ వంతు కృషి చేశామని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ కార్మికుల గొంతుకగా నిలుస్తూ నిరంతరం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రాజెక్టు స్థాయిలో కార్మికులు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెంపునకు యాజమాన్యంతో సహకరిస్తూనే కార్మికుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారంలో సంఘం నాయకత్వానికి యాజమాన్యం సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో కేంద్ర కమిటీ నాయకులు ఐ. సత్యం, కూర తిరుపతి, బొడ్డు రమేష్, మార్క్ నరేష్, బేతి రవితేజ, బ్రాంచ్ సెక్రటరీ ముసుకుల అనిల్ రెడ్డి, హరిప్రసాద్, ఓసీపీ–3 ప్రాజెక్ట్ సెక్రటరీ మామిడి తిరుపతి, పిట్ కార్యదర్శులు వెంకటేష్, దాసరి శ్రీనివాస్, బండి చంద్రశేఖర్, కరుణాకర్, రామ్ చరణ్ పాల్గొన్నారు. నూతన కమిటీ సభ్యులు పల్లె రాజేశం, మహిపతి, వేణుగోపాల్, రామచందర్, వంశీ, సతీష్, శ్రీనివాస్ కుమార్, మునేందర్, లక్ష్మీనారాయణ, సాగర్, రమేష్, ముక్కెర మహేందర్, కమలాకర్, కుమార్, వెంకటేష్, రాజశేఖర్, అశోక్, పోశం రమేష్, సంజీవరెడ్డి, మూర్తి, పారేపల్లి నరేందర్, రవి, రాజేశం, రవికుమార్, దేవేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, లక్ష్మణమూర్తి, శంకర్, నాగార్జున, కిరణ్, సురేష్, సత్యనారాయణ, పూర్ణచందర్, కనకరాజు, సాహిత్, జీవన్, లింగారెడ్డి, గుజ్జుల రాజేందర్, అంబి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

గుడిసె లేని తెలంగాణ నిర్మాణమే ఇందిరమ్మ రాజ్య లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తి చేసి నల్లగొండ జిల్లా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం

గుడిసె లేని తెలంగాణ నిర్మాణమే ఇందిరమ్మ రాజ్య లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తి చేసి నల్లగొండ జిల్లా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం

और पढ़ें →

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని గెలిపించండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని గెలిపించండి

• గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి • జనసైనికుల త్యాగాలకు తగిన గుర్తింపు ఇవ్వాలి • స్థానిక ఎన్నికల్లో జన సైనికులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి • గిరిజన గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది • ప్రజా అవసరాలను విస్మరించి.. పార్టీ రంగుల కోసం వందల కోట్ల ఖర్చు చేసింది • రాజకీయాలకు అతీతంగా గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా నిధుల కేటాయించాము • ⁠రహదారులు, ఉపాధి, వైద్య సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకున్నాం • అడవితల్లి బాట 2.0 ద్వారా రూ.2,052 కోట్లతో 2,569 పనులకు శ్రీకారం -ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్

और पढ़ें →