హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ , సెప్టెంబర్,22.మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం రాంగోపాల్ పేట డివిజన్ లో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ సుడిగాలి పర్యటన చేశారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా డివిజన్ లోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన గణ నాధులను దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ముందుగా జీరా గార్డెన్ లో శ్రీ వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, బాపనింటి ఎల్లమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణ నాధులను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం హైదర్ బస్తీ, ఓల్డ్ బోయిగూడ లో శ్రీ చక్ర వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఓల్డ్ గ్యాస్ మండి లో ఓల్డ్ మేకల బండ అసోసియేషన్ ఆధ్వర్యంలో, పాన్ బజార్ లో సత్కార్య సేవ అసోసియేషన్ ఆధ్వర్యంలో, సుభాష్ రోడ్డులో విగ్న హర టీమ్, కుమ్మరి బస్తీ లో మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో, రంగ్రేజ్ బజార్ లో స్నేహిత వ్యాయామశాల, జనరల్ బజార్ లో తెలంగాణ మరాఠా అసోసియేషన్ ఆధ్వర్యంలో, కళాసిగూడా లో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయులు, అనూప్, పార్క్ లైన్ లో గణపతి సేవా మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధులను దర్శించుకుని పూజలు నిర్వహించారు. పార్క్ లైన్ లో గణపతి సేవా మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో పూజల అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు గద ను బహుకరించారు. అదేవిధంగా హైదర్ బస్తీ లో ద్వారకా ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుడి కి పూజల అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. చుట్టాల బస్తీ లో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుడిని, నల్లగుట్ట జే లైన్ లో బిఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ, మహావీర్ యూత్ అసోసియేషన్, భ్రమరాంబ ఆలయం వద్ద మోరియా ఫ్రెండ్స్ అసోసియేషన్, ఎఫ్ లైన్ లో టీమ్ భజరంగ్ ఆధ్వర్యంలో, నల్లగుట్ట మార్కెట్ లో ఖన్నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణ నాధులను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, కోటేశ్వర్ గౌడ్, కొండాపురం మహేష్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, ఆంజనేయులు, సతీష్, టీనా, గణేష్, అరుణ్ భట్, చంద్ర ప్రకాష్, జనార్దన్, ఆనంద్ పాటిల్, నర్సింగ్, విఠల్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ద్విచక్ర వాహనంపై సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ , సెప్టెంబర్,22.మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం రాంగోపాల్ పేట డివిజన్ లో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ సుడిగాలి పర్యటన చేశారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా డివిజన్ లోన

ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది






ఇవి కూడా చదవండి
నాట్య తపస్వి అవార్డును అందుకున్న రాగ రంజని

నాట్య తపస్వి అవార్డును అందుకున్న రాగ రంజని రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ 22: శిఖరం ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాగ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు రాగ రంజని నాట్య తపస్వి అవార్డును
మిగతా చదవండి →దళితులు, ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధే లక్ష్యంసీఎం రేవంత్ రెడ్డి

Chief Minister Revanth Reddy stated that his government is dedicated to the progress of Dalits, Adivasis, and tribal communities through targeted welfare initiatives.
మిగతా చదవండి →మనతో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నవంబర్ 28న నిర్వహించనున్న ‘కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరబాద్ - ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసి’ ఈవెంట్ పోస్టర్ లాంచ్ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్

MLA Gangula Kamalakar launched the poster for 'Koti 50: The Biggest Live Concert in Hyderabad', celebrating legendary music director Koti's 50-year milestone.
మిగతా చదవండి →విజయ్ దేవరకొండ భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి" నుంచి 'ఏందయ్య సామీ..' ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్
Makers of Vijay Deverakonda and Rashmika Mandanna's pan-India film 'Ranabali' have released the full lyrical song 'Eandayya Sami' in five languages.
మిగతా చదవండి →