హైదరాబాద్: మాదాపూర్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సుష్మా చౌదరి (28) అనే యువతి మృతి చెందింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుష్మా చౌదరి తన స్నేహితుడు కొతిలి అక్షయ్ కుమార్ (28)తో కలిసి మంగళవారం రాత్రి మాదాపూర్‌లోని స్నేహితుడి ఇంటికి వెళ్లి భోజనం చేశారు.
అనంతరం అర్ధరాత్రి సమయంలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్‌పై కొండాపూర్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో హైటెక్ సిటీ సమీపంలోని చిన్న పెద్దమ్మ ఆలయం వద్ద సీఐఐ జంక్షన్ దగ్గర బైక్ అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను, అనంతరం చెట్టును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న సుష్మా తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించగా, చికిత్సకు ముందే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
స్నేహితుడు సందీప్ ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.





