భువనగిరి, నవంబర్ 20, ట్రైనెట్ న్యూస్ :
బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (బి.స్మాట్) యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు, ప్రెసిడెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్‌పర్సన్ తీగల జయలక్ష్మి జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యాసంస్థల ప్రముఖులు, పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు, బంధుమిత్రులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
డిగ్రీ, పీజీ ప్రైవేట్ కళాశాలల మేనేజ్‌మెంట్స్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బొజ్జ సూర్యనారాయణ రెడ్డి, బి.స్మాట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ డాక్టర్ పగిడాల జలంధర్ రెడ్డి ప్రత్యేకంగా హాజరై జయలక్ష్మికి పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం కేక్ కట్ చేయించి, ఆమెకు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయలక్ష్మి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. విద్యారంగంలో ఆమె మరింత ముందుకు సాగుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిలషించారు. విద్యాసంస్థల అభివృద్ధికి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేస్తూ మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాలల కరస్పాండెంట్లు ఐలేని రామిరెడ్డి, శ్రీనివాస్ రావు, పురేందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డితో పాటు వివిధ విద్యాసంస్థల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, అభిమానులు పాల్గొన్నారు. జయలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.





