బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

ప్రపంచానికి తెలంగాణ ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం -ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

Hyderabad, trinet NEWS, November 20: Health Minister Damodar Rajanarsimha stated that the government's goal is to make Telangana a global role model in the healthcare sector.

nagendraశుక్రవారం, 20 నవంబర్ 2026 · 9:34 PM15 వీక్షణలుtrinetnews.com
ప్రపంచానికి తెలంగాణ ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం -ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 20:

ఆరోగ్య రంగంలో తెలంగాణను ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఈ లక్ష్య సాధనలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, హాస్పిటళ్ల యాజమాన్యాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌కు ఉన్న వైద్యరంగ సామర్థ్యాన్ని మరింత విస్తరించి, మెడికల్ టూరిజంలో నగరాన్ని గ్లోబల్ హబ్‌గా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.

రాష్ట్ర సెక్రటేరియట్‌లో గురువారం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ హెల్త్ కేర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య రంగాల్లో వస్తున్న మార్పులు, తెలంగాణలో వైద్య సేవల విస్తరణ, మెడికల్ టూరిజం అభివృద్ధి, వైద్య విద్య, నైపుణ్యాల పెంపు తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ప్రపంచస్థాయి వైద్య నిపుణులు, అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటిని సమన్వయం చేసుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌లో హెల్త్‌కేర్ రంగ ప్రతినిధులంతా భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.

ప్రభుత్వ హాస్పిటళ్లలోనూ మెడికల్ టూరిజం సేవలు

మెడికల్ టూరిజం అభివృద్ధికి ప్రైవేటు రంగంతోపాటు ప్రభుత్వ హాస్పిటళ్లలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సనత్‌నగర్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్‌, నిమ్స్‌, అల్వాల్ టిమ్స్‌, కొత్తపేట టిమ్స్‌లలో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం వార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో ఉన్న అత్యుత్తమ వైద్య నైపుణ్యాలు, మౌలిక సదుపాయాలను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా విదేశీ రోగులకు కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించవచ్చన్నారు. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మెడికల్ టూరిజం అభివృద్ధి కోసం ఆరోగ్యశాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సమావేశంలో పాల్గొన్న డాక్టర్లు మంత్రిని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. అంతర్జాతీయ రోగులకు అవసరమైన సేవలు, సమన్వయం, ఇతర సదుపాయాలను ఒకే వ్యవస్థ ద్వారా అందించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ వైద్యులకు ఉచితంగా శిక్షణ

ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని ప్రైవేటు హాస్పిటళ్ల డాక్టర్లు తెలిపారు. జాయింట్ రీప్లేస్‌మెంట్‌, న్యూరో సర్జరీ, కార్డియో థొరాసిక్ సర్జరీ వంటి ప్రత్యేక వైద్య విభాగాల్లో ప్రభుత్వ సర్వీసులో కొత్తగా చేరే వైద్యులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కిమ్స్‌-సన్‌షైన్ ఎండీ డాక్టర్ గురువా రెడ్డి, ఇతర వైద్యులు వెల్లడించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో హానరరీ ప్రొఫెసర్లుగా సేవలందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

దీనిపై మంత్రి స్పందిస్తూ.. ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే పేద, మధ్యతరగతి రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ క్రమంలో ప్రైవేటు రంగంలోని అనుభవజ్ఞులైన వైద్యుల సేవలు, నైపుణ్యాలను తప్పకుండా వినియోగించుకుంటామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సంస్థల మధ్య పరస్పర సహకారం పెరిగితే వైద్య సేవల నాణ్యత మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశంసలు

కేన్సర్ చికిత్సను జిల్లా స్థాయిలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రతి జిల్లాలో కీమోథెరపీ సెంటర్లు ఏర్పాటు చేయడాన్ని డాక్టర్లు ప్రశంసించారు. అదేవిధంగా డయాలసిస్ సెంటర్ల నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ కిడ్నీ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఫార్మా వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ కొండపల్లి సాహితి, కిమ్స్‌-సన్‌షైన్ ఎండీ డాక్టర్ గురువా రెడ్డి, ఫిక్కీ మెంబర్ సర్జన్ కెప్టెన్ డాక్టర్ విజయ్ కుమార్, రెయిన్‌బో హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్, యూఎన్ మాజీ అధికారి డాక్టర్ శివ దుబిశెట్టి, యశోద హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ దశరథ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →