బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

కేటీఆర్ చేతుల మీదుగా ‘ఏఐ కెన్ రైట్ ద కోడ్’ పుస్తకావిష్కరణ

Authored by Hyderabad-based prominent AI expert Chennakesavulu Kummari Guidance for young engineers on new job opportunities and skills in the AI sector Another book, Use AI, Stay Relevant, to be released soon. Hyderabad, trinet NEWS

Super Adminశుక్రవారం, 20 నవంబర్ 2026 · 2:57 PM26 వీక్షణలుtrinetnews.com
కేటీఆర్ చేతుల మీదుగా ‘ఏఐ కెన్ రైట్ ద కోడ్’ పుస్తకావిష్కరణ

* హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఏఐ నిపుణుడు చెన్నకేశవులు కుమ్మరి రచన

* ఏఐ రంగంలో కొత్త ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాలపై యువ ఇంజినీర్లకు మార్గదర్శకం

* త్వరలో మరో పుస్తకం ‘యూజ్ ఏఐ, స్టే రిలెవెంట్’ విడుదల

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 20: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో ఇంజినీర్లకు అందుబాటులోకి రానున్న కొత్త ఉద్యోగ అవకాశాలు, అవసరమైన నైపుణ్యాలను వివరించే ‘ఏఐ కెన్ రైట్ ద కోడ్: హూ గెట్స్ ఇట్ ఇంటు ప్రొడక్షన్?’ పుస్తకాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణుడు చెన్నకేశవులు కుమ్మరి (కేశవ్) ఈ పుస్తకాన్ని రచించారు.

ఏఐ సాధనాలు క్షణాల్లో సాఫ్ట్‌వేర్ కోడ్ రాయగలుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజినీర్ల పాత్ర ఏమిటన్న ప్రశ్నకు ఈ పుస్తకం సమాధానం చూపిస్తుంది. కోడ్ రాయడం కంటే, ఏఐ వ్యవస్థలను వాస్తవ వ్యాపార అవసరాలకు అనుగుణంగా రూపొందించడం, సంస్థల డేటాతో అనుసంధానించడం, భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడటం, తక్కువ వ్యయంతో సమర్థంగా పనిచేసేలా చేసి వినియోగంలోకి తీసుకురావడం అసలైన సవాలని రచయిత వివరించారు.

ఈ క్రమంలో కొత్తగా ప్రాధాన్యత సంతరించుకుంటున్న ‘ఏఐ ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజినీర్’ (ఎఫ్‌డీఈ) ఉద్యోగ పాత్రను పుస్తకం పరిచయం చేస్తుంది. వ్యాపార సంస్థలతో నేరుగా పనిచేస్తూ, వాటి అవసరాలకు అనుగుణంగా ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేసి, సురక్షితంగా అమలయ్యే వరకు బాధ్యత తీసుకునే ఇంజినీర్లకు భవిష్యత్తులో విస్తృత అవకాశాలు ఉంటాయని పేర్కొంది. మొత్తం 24 అధ్యాయాలుగా రూపొందిన ఈ పుస్తకంలో ఏఐ రిట్రీవల్ సిస్టమ్స్, ఏఐ ఏజెంట్లు, భద్రత, డిప్లాయ్‌మెంట్, ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలను భారతీయ పరిశ్రమల ఉదాహరణలతో వివరించారు.

సాఫ్ట్‌వేర్, క్లౌడ్, డెవాప్స్ ఇంజినీర్లతో పాటు ఏఐ రంగంలోకి ప్రవేశించాలనుకునే విద్యార్థులు, ఫ్రెషర్లు, సాంకేతిక సంస్థల నాయకులకు ఈ పుస్తకం ఉపయోగపడనుంది. ఏఐ కోడ్ రాయగలిగినా, వాస్తవ సమస్యలను అర్థం చేసుకుని, సాంకేతికతను నిజ జీవిత అవసరాలకు అనుసంధానించి, సురక్షితంగా పనిచేసేలా చేయడం ఇంజినీర్ల బాధ్యత అని రచయిత చెన్నకేశవులు కుమ్మరి పేర్కొన్నారు. పుస్తకాన్ని ఆవిష్కరించి, నూతన తరం ఏఐ ఇంజినీర్లను ప్రోత్సహించిన కేటీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

త్వరలో రెండో పుస్తకం విడుదల

కేశవ్ రచించిన రెండో పుస్తకం ‘యూజ్ ఏఐ, స్టే రిలెవెంట్: హౌ టు థింక్, వర్క్, అండ్ థ్రైవ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ త్వరలో విడుదల కానుంది. ఇది కేవలం ఇంజినీర్లకే కాకుండా విద్యార్థులు, ఉద్యోగులు, ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలు సహా అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా రూపొందించారు. సులభమైన భాషలో భారతీయ కార్యాలయాల అనుభవాలు, సిద్ధంగా ఉపయోగించుకోగల ప్రాంప్ట్‌లు, 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా రోజువారీ పనుల్లో ఏఐని ఎలా వినియోగించుకోవాలో వివరిస్తుంది. రచయిత చెన్నకేశవులు కుమ్మరి హైదరాబాద్‌లోని సీ3ఆప్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు. ఏఐ ఎఫ్‌డీఈ ఆర్కిటెక్ట్‌గా, మెంటార్‌గా పనిచేస్తూ, ఏఐ ఆలోచనలను వాస్తవ వ్యాపార అవసరాలకు అనుగుణంగా అమలు చేసే వ్యవస్థలుగా రూపొందించడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ రెండు పుస్తకాలు పేపర్‌బ్యాక్, కిండిల్ రూపాల్లో అందుబాటులోకి రానున్నాయి. పుస్తకాల వివరాలు, ప్రతుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో @kesavkummari ద్వారా సంప్రదించవచ్చని రచయిత తెలిపారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →