బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,903+2.28%
NIFTY25,732+2.00%
22K₹1,12,812/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

ఓయూలో దివ్యాంగుల హక్కులకు పెద్దపీట వేయాలి..

University Disability Forum demands that the rights of persons with disabilities legally vested in Usmaniya University be enforced, as per 18th November.

nagendraగురువారం, 19 నవంబర్ 2026 · 5:27 AM18 వీక్షణలుtrinetnews.com
ఓయూలో దివ్యాంగుల హక్కులకు పెద్దపీట వేయాలి..

సికింద్రాబాద్, నవంబర్ 18,

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దివ్యాంగులకు చట్టబద్ధంగా కల్పించిన హక్కులను అమలు చేయాలని విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఫోరం ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల నుంచి వీసీ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టి, వైస్ ఛాన్సలర్‌కు వినతిపత్రం సమర్పించారు. దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం - 2016 ప్రకారం ఉద్యోగ నియామకాల్లో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. విశ్వవిద్యాలయంలో టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌ లాగ్ ఖాళీలను గుర్తించి ప్రత్యేక నియామకాల ద్వారా భర్తీ చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. రోస్టర్ విధానాన్ని పారదర్శకంగా అమలు చేయడంతో పాటు ఇప్పటివరకు భర్తీ చేసిన పోస్టులు, మిగిలిన ఖాళీల వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. అర్హులైన దివ్యాంగ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యం తగదన్నారు. దివ్యాంగులకు జాలి కాకుండా హక్కులు కల్పించాలని, తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్, మారవేణి చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →