బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,903+2.28%
NIFTY25,732+2.00%
22K₹1,12,812/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

పేద విద్యార్థుల భవితకు భరోసా..!

Kisan Reddy, who stood by to pay examination fees for 4,741 students in TENTH 87 Government schools under Parliament of the Union Minister of Sindhrabad

nagendraగురువారం, 19 నవంబర్ 2026 · 5:08 AM16 వీక్షణలుtrinetnews.com
పేద విద్యార్థుల భవితకు భరోసా..!

4,741 మంది టెన్త్ విద్యార్థులకు పరీక్షా ఫీజు చెల్లించి అండగా నిలిచిన కిషన్ రెడ్డి

​87 ప్రభుత్వ పాఠశాల పేద విద్యార్థుల ఫీజుల భారం మోసి పెద్ద మనసు చాటుకున్న కేంద్రమంత్రి

సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆర్థిక చేయూత

చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డుకాకూడదు.. ఏటా పేద విద్యార్థుల చదువుకు బాసటగా నిలుస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీల బలోపేతంపై ప్రత్యేక దృష్టి...!

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 18:

ఆర్థిక ఇబ్బందులు ఏ ఒక్క పేద విద్యార్థి చదువుకు ఆటంకం కాకూడదనే సదుద్దేశంతో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ, వారందరి పరీక్షా ఫీజులను స్వయంగా చెల్లించి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.

విద్యాభివృద్ధితోనే సమాజ వికాసం సాధ్యమని బలంగా విశ్వసించే కిషన్ రెడ్డి, గత కొన్ని సంవత్సరాలుగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పేద విద్యార్థుల చదువుకు ఏటా బాసటగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మొత్తం 87 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 4,741 మంది పదో తరగతి విద్యార్థుల పరీక్షా ఫీజులను ఆయన పూర్తిగా భరించారు. తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా, విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలపై దృష్టి సారించేందుకు ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

​అంగన్వాడీల నుంచి ప్రభుత్వ పాఠశాలల వరకు మౌలిక వసతుల కల్పనకు కృషి..!

గతంలో అంబర్‌పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచే విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కిషన్ రెడ్డి, ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులకు బూట్లు (షూస్), దుస్తులు, నోట్‌బుక్స్ అందించడంతో పాటు పాఠశాలల్లో బెంచీలు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణం మరియు వాటి పరిశుభ్రత కోసం టాయిలెట్ క్లీనింగ్ మిషన్లు వంటి ఆధునిక మౌలిక వసతులను కల్పనకు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా, చిన్నారుల ప్రాథమిక విద్యకు పునాది అయిన అంగన్వాడీ కేంద్రాలను సైతం ఆహ్లాదకరమైన, ఆధునిక వసతులతో తీర్చిదిద్దుతూ పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఆయన అండగా నిలుస్తున్నారు.

పేద విద్యార్థులకు పరీక్షా ఫీజులు చెల్లించి, ఇటు పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తూ పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కిషన్ రెడ్డి నిరంతరం అండగా నిలుస్తున్నారు. ఆయన చూపిస్తున్న ఈ ఆదరణ, సేవా తత్పరత ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని స్థానిక ప్రజలు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు హర్ష్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →