బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,903+2.28%
NIFTY25,732+2.00%
22K₹1,12,812/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి: సి.ఎస్. సంజయ్ జాజు

Hyderabad, Trinet News, 18th November: Shri Sanjay Jaju District Collector urges the State Government to make all necessary arrangements for implementation of the ambitious Indiramma Family Insurance Scheme

nagendraగురువారం, 19 నవంబర్ 2026 · 4:41 AM7 వీక్షణలుtrinetnews.com
ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి: సి.ఎస్. సంజయ్ జాజు
  1. హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 18:

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుపై నేడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్ర‌ణాళిక శాఖ కార్య‌ద‌ర్శి గౌర‌వ్ ఉప్ప‌ల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, పౌర సరఫరాల కమిషనర్ నాగిరెడ్డి, కార్మిక శాఖ కార్యదర్శి హరిచందన, ఐ.టి శాఖ ప్రత్యేక కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీతో పాటు అన్ని మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం వివిధ వర్గాలకు ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ బీమా పథకాలను ఈ ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం గొడుగు కిందకు వస్తాయని స్పష్టం చేశారు. వివిధ శాఖల్లోద్వారా ప్రస్తుతం ఉన్న నేతన్న, గౌడ, కార్మిక, మత్సకారులకు అమలులో ఉన్న రెండు లక్షల రూపాయల జీవిత బీమాను ఇందిరమ్మ బీమా పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఐదు లక్షల రూపాయలకు పెరుగుతాయని అన్నారు. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అర్హులైన ప్రతి కుటుంబంలోని సభ్యులందరూ ఈ పథకంలో నమోదు చేసుకునేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు అన్ని మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. పథకం మార్గదర్శకాలను అధికారులు కచ్చితంగా పాటిస్తూ, నమోదు ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు.

దాదాపు నెలరోజుల పాటు కొనసాగే ఈ నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. ఈ భీమా నమోదుకు ప్రత్యేక యాప్ కు కూడా రూపొందిస్తున్నామని, ఆన్-లైన్ లోనూ నమోదుకు దరకాస్తులను అందుబాటులో ఉంచాలన్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →