బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,800+2.16%
NIFTY25,747+2.06%
22K₹1,12,866/10g+1.30%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

పోలీసు అధికారుల పదోన్నతుల సమస్యకు తెర.. త్వరలో ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభం

1991, 1995, 1996 బ్యాచ్‌ల అధికారులకు ఊరట.. తొలుత 1991 బ్యాచ్‌తో పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం: డీజీపీ సీవీ ఆనంద్ హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 17: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 1991, 1995, 1996 బ్యాచ్‌ల డీఎస్పీలు, అద

nagendraబుధవారం, 18 నవంబర్ 2026 · 6:04 AM24 వీక్షణలుtrinetnews.com
పోలీసు అధికారుల పదోన్నతుల సమస్యకు తెర.. త్వరలో ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభం

1991, 1995, 1996 బ్యాచ్‌ల అధికారులకు ఊరట.. తొలుత 1991 బ్యాచ్‌తో పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం: డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 17:

సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 1991, 1995, 1996 బ్యాచ్‌ల డీఎస్పీలు, అదనపు ఎస్పీల పదోన్నతుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. వివిధ కారణాలతో ఏళ్ల తరబడి ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న పోలీసు అధికారులకు త్వరలో పదోన్నతులు కల్పించేందుకు మార్గం సుగమమైంది. ఈ విషయాన్ని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.

ఈ పదోన్నతుల ప్రక్రియలో భాగంగా సంబంధిత అధికారులతో డీజీపీ మరోసారి సమావేశమయ్యారు. గతంలో నిర్వహించిన సమావేశంలో పదోన్నతులకు సంబంధించి ఉన్న సంక్లిష్టతలను అధికారులకు వివరించి, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం సహకరించాలని కోరినట్లు తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన అధికారులు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న తమ కేసులను ఉపసంహరించుకున్నారని చెప్పారు. డీజీపీ నిర్ణయాలపై పూర్తి విశ్వాసం ఉందని, తమకు అనుకూలంగా నిర్ణయం రాకపోయినా న్యాయపరమైన చర్యలకు వెళ్లబోమని అఫిడవిట్లు సమర్పించినట్లు వెల్లడించారు.

అధికారుల ఏకాభిప్రాయంతో ప్రతిష్టంభనకు తెర

గత కొన్ని నెలలుగా డీజీపీ కార్యాలయం, ఐజీ (పర్సనల్)తో కూడిన కమిటీ పదోన్నతుల అంశంపై విస్తృతంగా కసరత్తు చేసింది. సీనియారిటీ జాబితాలు, వాటిలోని వ్యత్యాసాలు, ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు), పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులను సమగ్రంగా పరిశీలించింది. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు కమిటీ పలు అంశాలను అధ్యయనం చేసి సిఫార్సులు రూపొందించింది.

ఈ సమావేశంలో కమిటీ చేసిన సిఫార్సులను డీజీపీ అధికారులకు వివరించారు. అందుబాటులో ఉన్న ఖాళీలతో పాటు, ప్రతి అధికారి వారీగా ప్రతిపాదించిన పదోన్నతి, పదోన్నతి అమలయ్యే తేదీల వివరాలను తొలిసారిగా వారి ముందుంచారు. కమిటీ సిఫార్సులకు అధికారులందరూ ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారని డీజీపీ వెల్లడించారు. దీంతో చాలా కాలంగా కొనసాగుతున్న పదోన్నతుల ప్రతిష్టంభనకు తెరపడిందన్నారు.

తొలుత 1991 బ్యాచ్‌కు ప్రమోషన్లు

ఈ సమస్యకు పరిష్కారం లభించకపోతే సంబంధిత అధికారుల్లో చాలామంది తమకు రావాల్సిన పదోన్నతులు పొందకుండానే ప్రస్తుత హోదాల్లో పదవీ విరమణ చేయాల్సి వచ్చేదని డీజీపీ పేర్కొన్నారు. ప్రభుత్వానికి కమిటీ సిఫార్సులు, సంబంధిత వివరాలను సమర్పించిన అనంతరం దశలవారీగా పదోన్నతుల ప్రక్రియను చేపడతామని తెలిపారు. తొలుత 1991 బ్యాచ్ అధికారులతో ఈ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల సమస్య పరిష్కారానికి సహకరించిన అధికారులందరినీ డీజీపీ సీవీ ఆనంద్ అభినందించారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →