బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,800+2.16%
NIFTY25,747+2.06%
22K₹1,12,866/10g+1.30%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: మంత్రి వివేక్ వెంకటస్వామి

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం.. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం మందమర్రి, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 17: పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్ర

nagendraబుధవారం, 18 నవంబర్ 2026 · 6:03 AM11 వీక్షణలుtrinetnews.com
పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: మంత్రి వివేక్ వెంకటస్వామి

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం.. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

మందమర్రి, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 17: పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే తమ లక్ష్యమని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మందమర్రి మండలం గద్దెరాగడిలో క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీలతో పాటు మందమర్రి మండలానికి చెందిన లబ్ధిదారులకు కొత్త చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అర్హత ఉన్నప్పటికీ పింఛన్లు అందని వారిని గుర్తించేందుకు మరోసారి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, అర్హులందరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నాలుగు లక్షలకు పైగా పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం

ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో గత ఏడాది 3,500 ఇందిరమ్మ ఇళ్లు, ఈ ఏడాది మరో 2,000 ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 1,800 ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. మందమర్రి ఏజెన్సీ ప్రాంతంలో భూ సమస్య పరిష్కారానికి సింగరేణి సంస్థతో చర్చలు జరుపుతున్నామని, ఆరు ఎకరాల్లో సుమారు 600 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని వివరించారు.

రూ.800 కోట్లతో అభివృద్ధి పనులు

చెన్నూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా మొత్తం రూ.800 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగా రూ.100 కోట్లతో తాగునీటి సదుపాయాలు కల్పించనున్నామని, సోమన్‌పల్లిలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, మందమర్రిలో రూ.10 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

చెన్నూరులో 100 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, మందమర్రిలో మరో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కొత్త బొగ్గు గనుల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీలేని రుణాలు వంటి సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడం, చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. మాటలకే పరిమితం కాకుండా చేతల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →