బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,800+2.16%
NIFTY25,747+2.06%
22K₹1,12,866/10g+1.30%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

తెలుగు వర్సిటీలో ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి ముమ్మర ప్రచారం

చట్టసభల్లో యువత, విద్యార్థి,ఉపాద్యాయుల గొంతుకనవుతానని భరోసా ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని పిలుపు ఆటపాటలతో ఘన స్వాగతం పలికిన విద్యార్థులు హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 17: పట్టభద్రుల (గ్రాడ్యుయేట

nagendraబుధవారం, 18 నవంబర్ 2026 · 6:00 AM6 వీక్షణలుtrinetnews.com
తెలుగు వర్సిటీలో ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి ముమ్మర ప్రచారం

* చట్టసభల్లో యువత, విద్యార్థి,ఉపాద్యాయుల గొంతుకనవుతానని భరోసా

* ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని పిలుపు

* ఆటపాటలతో ఘన స్వాగతం పలికిన విద్యార్థులు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 17:

పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ప్రచారం నిమిత్తం విశ్వవిద్యాలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆయనకు విద్యార్థులు పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అనంతరం విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల ఆలోచనలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని అన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ లోని పలు సమస్యలను విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకురాగా, యూనివర్సిటీలోని సమస్యలన్నింటినీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందని గుర్తుచేశారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తే ధ్యేయంగా, మాదకద్రవ్యాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కొంతమంది నేతలు తమ రాజకీయ స్వార్థం కోసం విద్యార్థులను వాడుకోవాలని రెచ్చగొడుతుంటారని, అలాంటి నేతలకు దూరంగా ఉండాలని ఆయన హితవు పలికారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులందరూ తప్పనిసరిగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. విద్యావంతులు తమ అమూల్యమైన ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని, ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. చట్టసభలకు తనను పంపితే యువత, విద్యార్థుల,ఉపాధ్యాయుల సమస్యల కోసం కొట్లాడి, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. యువకుడినైన తనకు అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో పాటు విద్యార్థి నేతలు అనిల్, సంతోష్, శివ,నక్క మహేష్ యాదవ్,ప్రశాంత్, సాయి శేఖర్, సునీల్ తదితరులు నాయకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →