బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,800+2.16%
NIFTY25,747+2.06%
22K₹1,12,866/10g+1.30%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. అభివృద్ధిలో భాగస్వాములు కండి

గుజరాత్‌ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం 2047 నాటికి 3 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం అహ్మదాబాద్‌లో ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ రోడ్‌షో.. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి భేటీలు

nagendraబుధవారం, 18 నవంబర్ 2026 · 5:50 AM5 వీక్షణలుtrinetnews.com
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. అభివృద్ధిలో భాగస్వాములు కండి

అహ్మదాబాద్‌, ట్రైనెట్ న్యూస్, నవంబరు 17:

తెలంగాణను ప్రపంచస్థాయి పారిశ్రామిక, పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేర్చాలన్న లక్ష్యంతో తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ను రూపొందించామని వెల్లడించారు. ఈ ప్రగతి ప్రస్థానంలో గుజరాత్‌ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని, తమ వ్యాపార విస్తరణకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంచుకోవాలని కోరారు.

డిసెంబరు 7 నుంచి 9 వరకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026లో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు.

గుజరాత్‌ పారిశ్రామికవేత్తలతో మమేకం

అహ్మదాబాద్‌లోని తాజ్‌ స్కైలైన్‌ హోటల్‌లో సోమవారం తెలంగాణ ప్రభుత్వం, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహించిన ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ రోడ్‌షోలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గుజరాత్‌ పారిశ్రామికవేత్తలు దేశంలోనే అత్యంత బలమైన పారిశ్రామిక సంస్థలను నిర్మించారని, వారిలో చాలామంది ఇప్పటికే తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించారని పేర్కొన్నారు. అన్ని స్థాయిల పెట్టుబడులకు అనువైన పారిశ్రామిక వాతావరణాన్ని రాష్ట్రంలో కల్పిస్తున్నామని తెలిపారు. గుజరాత్‌ వ్యాపారవేత్తలు తెలంగాణతో కలిసి ఎదగాలని, రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

పెట్టుబడుల అవకాశాలపై ప్రజెంటేషన్‌

తెలంగాణలో అందుబాటులో ఉన్న పారిశ్రామిక మౌలిక వసతులు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, వివిధ రంగాల్లో అవకాశాలను రాష్ట్ర అధికారుల బృందం గుజరాత్‌ పారిశ్రామికవేత్తలకు వివరించింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ శశాంక, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరిశ్రమల శాఖ కమిషనర్‌ నిఖిల్‌ చక్రవర్తి ప్రజెంటేషన్లు ఇచ్చారు.

ఇప్పటికే తెలంగాణలో పరిశ్రమలు నిర్వహిస్తున్న సంస్థల ప్రతినిధులు తమ పెట్టుబడి అనుభవాలను వివరించారు. రాష్ట్రంలో వ్యాపార కార్యకలాపాల విస్తరణకు ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అనుకూలతలను ప్రస్తావించారు.

ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీలు

రోడ్‌షో అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు గుజరాత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఇంధన, ఔషధ, వస్త్ర, రసాయన, ఆహార శుద్ధి, సాంకేతిక రంగాలకు చెందిన సంస్థల ఉన్నతాధికారులతో చర్చించారు. తెలంగాణలో కొత్త పెట్టుబడులు పెట్టడం, ఇప్పటికే ఉన్న వ్యాపార కార్యకలాపాలను విస్తరించడం, రెండు రాష్ట్రాల మధ్య పారిశ్రామిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు.

కార్యక్రమంలో ఫిక్కీ గుజరాత్‌ రాష్ట్ర మండలి సభ్యుడు, బ్లూక్రాఫ్ట్‌ ఆగ్రో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ చౌధరి, ఫిక్కీ గుజరాత్‌ రాష్ట్ర మండలి డైరెక్టర్‌ బిజు నంబూదిరిలు కూడా పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →