బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,800+2.16%
NIFTY25,747+2.06%
22K₹1,12,866/10g+1.30%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

నాణ్యత లేని భోజనంపై ఓయూ లేడీస్ హాస్టల్ విద్యార్థినుల ఆగ్రహం.. పురుగులు పడిన అన్నం వడ్డిస్తున్నారంటూ అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయింపు..

Osmania University, Trinet News, November 16: Expressing deep dissatisfaction over the quality of food being served in the hostel, Osmania University ladies hostel students staged a midnight protest. Every day students...

nagendraమంగళవారం, 17 నవంబర్ 2026 · 5:35 AM10 వీక్షణలుtrinetnews.com
నాణ్యత లేని భోజనంపై ఓయూ లేడీస్ హాస్టల్ విద్యార్థినుల ఆగ్రహం.. పురుగులు పడిన అన్నం వడ్డిస్తున్నారంటూ అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయింపు..

ఉస్మానియా యూనివర్సిటీ, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 16 :

హాస్టల్‌ లో అందిస్తున్న భోజనం నాణ్యతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ విద్యార్థినులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. ప్రతిరోజూ విద్యార్థినులకు వడ్డిస్తున్న ఆహారం నాణ్యతగా ఉండటం లేదని, అన్నంలో పురుగులు కనిపిస్తున్నాయని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అందిస్తున్న భోజనంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ అన్నం, కూర ఉన్న గిన్నెలను చేతబట్టి హాస్టల్ నుంచి బయటకు వచ్చి యూనివర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినులు హాస్టల్‌లో ఆహార నాణ్యతను తక్షణమే మెరుగుపరచాలని, పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన భోజనం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థినుల సమస్యలను సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై వీసీ స్పందించకపోవడంతో విద్యార్థినులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో ముడిపడిన ఆహార నాణ్యత విషయంలో యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే స్పందించాలని వారు కోరారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →