బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,800+2.16%
NIFTY25,747+2.06%
22K₹1,12,866/10g+1.30%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

నవ భారత నిర్మాణంలో నెహ్రూ ఆలోచనలు కీలకం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Hyderabad, Trinit News, 16th November: Pandit Jawaharlal Nehru as India's first Prime Minister in the face of multiple crises such as partition and food shortages.

nagendraమంగళవారం, 17 నవంబర్ 2026 · 5:21 AM1 వీక్షణలుtrinetnews.com
నవ భారత నిర్మాణంలో నెహ్రూ ఆలోచనలు కీలకం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 16:

దేశ విభజన, ఆహార కొరత వంటి అనేక క్లిష్ట పరిస్థితుల మధ్య భారత తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, పంచవర్ష ప్రణాళికలు, అలీన విధానం ద్వారా నవ భారత నిర్మాణానికి బలమైన పునాదులు వేశారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

నెహ్రూ ఆలోచనలు, ఆశయాలు, సిద్ధాంతాలను నేటి యువతరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నెహ్రూ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నెహ్రూవియన్ ఫిలాసఫీని కేవలం తెలంగాణకే పరిమితం చేయకుండా దక్షిణ భారతదేశం అంతటా విస్తరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గాంధేయ, నెహ్రూ సిద్ధాంతాలను అధ్యయనం చేస్తూ, వాటి విలువలను తెలుసుకునేందుకు అంకితభావంతో ముందుకు సాగుతున్న విద్యార్థులను భట్టి విక్రమార్క అభినందించారు. మహాత్మా గాంధీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఆలోచనలు, ఆదర్శాలను యువత అధ్యయనం చేయడం ద్వారా దేశ చరిత్ర, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక బాధ్యతలపై మరింత అవగాహన పెంపొందించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

నెహ్రూ సెంటర్ ద్వారా ఈ సిద్ధాంతాలను భావితరాలకు చేరువ చేయడంతో పాటు, దక్షిణ భారతదేశవ్యాప్తంగా వాటిపై చర్చలు, అధ్యయనాలకు ప్రోత్సాహం కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →