హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 16:
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లో ఎందరో నాడు నిజాం రజాకార్ల దుర్మార్గాల వ్యతిరేకం గా భూస్వాముల దౌర్జెన్యాల ఎదిరించి పోరాడారు అని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉప కులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు పెన్ను,గన్ను పట్టి ఎదిరించిన వారిలో బండి యాదగిరి ప్రముఖుడు అని ఆయన చెప్పారు తెలంగాణ సాయుధ పోరాట కవి గా బండి యాదగిరి గుర్తింపు పొందారని ఆయన గుర్తు చేశారు శ్రీ త్యాగరాయ గానసభ లోని గుండవరపు హనుమంత రావు కళా వేదిక పై గాన సభ నిర్వహణలో జరుగుతున్న ఎందరో మహానుభావులు కార్యక్రమ పరంపర లో భాగంగా బండి యాదగిరి యాది లో సంస్మరణ సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ ఒకేఒక్క పాట నిజాం ను రజాకార్లు గుండెలో భయం రేకెత్తించింది అని ఆ పాట బండేనక బండి కట్టి ఏ బండి లో పోతావురో నిజాం సర్కరోడ అని రాసిన వారు బండి యాదగిరి అని చెప్పారు అధ్యక్షత వహించిన గాన సభ అధ్యక్షుడు కళా జనార్థన మూర్తి మాట్లాడుతూ బండి యాదగిరి జన్మించిన తేదీ కచ్చితం గా ఆధారాలు లేవని కానీ తెలంగాణ పోరాట కవి గా ఆయనను స్మరించుకోవడం గాన సభ బాధ్యత గా చేస్తోంది అని తెలిపారు వేదిక పై యువ కళా వాహిని అధ్యక్షుడు లంక లక్ష్మీ నారాయణ గాయకుడు శ్రీధరమ్ రామ సుబ్రహ్మణ్యం గాయని రాధా రాణి పాల్గొన్నారు








