బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,800+2.16%
NIFTY25,747+2.06%
22K₹1,12,866/10g+1.30%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

మీడియా కమీషషన్ ను ఏర్పాటు చెయ్యాలి

nagendraమంగళవారం, 17 నవంబర్ 2026 · 4:54 AM5 వీక్షణలుtrinetnews.com
మీడియా కమీషషన్ ను ఏర్పాటు చెయ్యాలి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 16:

ప్రస్తుత సమాజంలో మీడియాలో వచ్చిన పెను మార్పులు, సోషల్ మీడయా ఉధృతి నేపథ్యంలో మీడియా, జర్నలిస్టులకు సంబంధించి సమగ్ర అధ్యయనం చేసేందుకు మీడియా కమీషషన్ ను ఏర్పాటు చేయాలని వక్తలు కోరారు.

సోషల్ మీడియా దూసుకుపోతున్న తరుణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలకు అర్థమయ్యేరీతిలో కచ్చితత్వం, వాస్తవాధారంగా, వేగంగా వార్తలను అందించాల్సిన అవసరం ప్రధాన మీడియా సంస్థలపై ఉందని ఎమ్.ఎల్.సి., ప్రొఫెసర్ కొందండరాం తెలిపారు.

నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి కార్యాలయంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల తెలంగాణ మీడియా అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవం (నేషనల్ ప్రెస్ డే) కార్యక్రమం మీడియా అకాడమి చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. దేశంలో మొదటి ప్రెస్ కమీషన్ ఏర్పాటు చేసి వర్కింగ్ జర్నలిస్టులు, వార్తా పత్రికలు, చట్టాలు ఏలా రూపొందించాలో ఆనాటి ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ సూచనల మేరకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను 1966 నవంబర్ 16న ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ప్రెస్ కౌన్సి ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన రోజునే జాతీయ పత్రికా దినోత్సవం (నేషనల్ ప్రెస్ డే) నిర్వహించుకోవడం ఆనావాయితిగా వస్తుందన్నారు. అందులో భాగంగా నేడు మనం నేషననల్ ప్రెస్ డే సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా ఎమ్.ఎల్.సి., ప్రొఫెసర్ కొందండరాం మాట్లాడుతూ, భవిష్యత్తు తరాలకు అనుగుణంగా మీడియాలో మార్పులు, సమీకరణలు అవసరం అన్నారు. ఇప్పటికే ప్రధాన మీడియాలైన ప్రింట్ అండ్ ఎలక్టానిక్ సంస్థలు ప్రజల విశ్వాసాన్ని కొల్పోతున్నాయి. దీని స్థానంలో సోషల్ మీడియా ప్రజలకు చేరువైనందున దానినే ప్రజలు ఆసక్తిగా మార్చుకుంటున్నారు. అంతేగాక కొన్ని యాజమాన్యాలు ప్రభుత్వాధినేతల మద్దతు కోసం మాత్రమే దృష్టి సారిస్తూ అసలు వార్తల స్వరూలనే మార్చి వేస్తున్నారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. వార్తలను కేవలం సంచలన కథనాల కోసం మాత్రమే ఆరాటపడుతున్నారు. కానీ, సమాజానికి ఏది అవసరం మనం ఏం వార్తలను అందిస్తున్నాము. అవి ప్రజలకు ఎంత మాత్రం మేలు చేస్తున్నాయి అనేది కూడా ఆలోచన చేయాలన్నారు.

మీడియా అకాడమి చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, నేడు జాతీయ పత్రికా దినోత్సవం సందర్బంగా “జర్నలిజం, పాప్లిస్ట్, రెస్పాన్సిబుల్” అనే అంశం గురించి వివరించారు. మీడియా ఎప్పుడు ప్రజల పక్షాననే ఉండాలన్నారు. సమాజంలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతున్నందున మీడియా సంస్థలు తమ విశ్వసనీయతను కాపాడటం కోసం కచ్చితమైన, నైతిక వార్తా సేకరణలే ముఖ్యం అన్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో పత్రికలు పోషించిన పాత్ర చాలా కీలకమన్నారు. అదే విధంగా దేశంలో పాత్రికేయుల ప్రమాణాలను కాపాడటానికి, మీడియా సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి అందరం కలిసికట్టుగా అంకితభావంతో పని చేయాలని ఆయన తెలిపారు. అదేవిధంగా విజ్ఞానవంతమైన, పారదర్శకమైన సమాజాన్ని నిర్మించడానికి జర్నలిస్టులు కృషి చేయాలన్నారు. పాత్రికేయ భవిష్యత్తు బలంగా, స్వేచ్ఛగా, బాధ్యతాయుంతంగా ఉండేలా మీడియా సంస్థలు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అంతేగాక మీడియా చట్టాలపై జర్నలిస్టులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కోరారు.

ప్రొఫేసర్ కే. హరగోపాల్ మాట్లాడుతూ, దేశంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపించినప్పటి నుండి ఒక స్వతంత్ర సంస్థగా కొనసాగుతుందన్నారు. జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ పర్యవేక్షణ చేస్తుందన్నారు. అదే విధంగా మీడియాపై బెదిరింపులు వచ్చినప్పుడు రక్షించడం కూడా ఆ సంస్థ బాధ్యతనే అన్నారు. అదే విధంగా ప్రభుత్వాలు కూడా మీడియాను నియంత్రించాలని ఎప్పూడూ చూస్తుంది. కానీ అవి జర్నలిస్టులపై ఎన్ని ప్రయోగాలు చేసినా అవి సాధ్యం కావలని గ్రహించి నేడు మీడియా సంస్థలను తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నాయని ఆయన వివరించారు. మీడియా సంస్థలలో పని చేసే జర్నలిస్టులు తమ వృత్తిలో ఒక క్రమశిక్షణను అలవర్చుకుని పని చేయాలన్నారు. మనకి మనవే ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవాలన్నారు. అప్పుడే సమాజంలో మన జర్నలిస్టులకు గొప్ప గౌరవం లభిస్తుందన్నారు.

శ్రీమతి పద్మజా మాట్లాడుతూ, మీడియా అంటే నేడు ఇండస్ట్రీ అనుకుంటున్నారని ఆమె తెలిపారు. పత్రికలు, ఛానళ్లు ప్రారంభించడం, పాఠకులు, వీక్షకులను తయారు చేసుకోవడం, క్షేత్రస్థాయిలో జర్నలిస్టులు, న్యూస్ రూమ్లలో యాంకర్స్ వార్తలను అందించడం పరిపాటిగా మారింది. ప్రజలకు ప్రభుత్వ, సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల అవగాహన కలిగించడం చేయాలన్నారు. ప్రకృత్తి వైపరిత్యాల గురించి ముందే హెచ్చరించే వార్తలను కవర్ చేయాలన్నారు. కానీ నేడు సంచలనాలకు మారుపేరుగా రాజకీయ లేదా నేర వర్తలను ప్రధానంగా చూపిస్తూ ప్రజలను గందరగోలానికి గురిచేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక పోక్సో కేసుల విషయంలో చిన్నారుల గొప్యత ముఖ్యం అని అనేక సందర్భాలలో తెలియజేసినా మన మీడియాలో అవే తప్పులు మళ్లి మళ్లీ చేస్తున్నారన్నారు.

అమేర్ అలీ ఖాన్ మాట్లాడుతూ, మీడియా వృత్తిలోకి వచ్చేది అడ్డదారుల్లో డబ్బులు సంపాదించడానికి కాదన్నారు. నీతి నిజాయితీతో పని చేసి జర్నలిజం వృత్తికి మంచి పేరు తేవాలన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కె. రామచంద్రమూర్తి, మల్లెపల్లి లక్ష్మయ్య, ఎన్. వేణుగోపాల్, కె. సాజయ్య, టియుడబ్ల్యూజే అధ్యక్షలు కె. విరాహత్ అలీ, ప్రధానకార్యదర్శి కె. రామ్ నారాయణ, మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →