బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,716+2.05%
NIFTY25,768+2.14%
22K₹1,12,787/10g+1.24%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

జాతీయవాద ఉద్యోగులంతా ఐక్యంగా ఉండాలి ఉద్యోగులకు పెన్షన్‌ విధానం ప్రవేశపెట్టాలి: రామ్మోహన్‌

nagendraఆదివారం, 15 నవంబర్ 2026 · 5:06 AM11 వీక్షణలుtrinetnews.com
జాతీయవాద ఉద్యోగులంతా ఐక్యంగా ఉండాలి ఉద్యోగులకు పెన్షన్‌ విధానం ప్రవేశపెట్టాలి: రామ్మోహన్‌

టీజీఈఎఫ్‌ రాష్ట్ర అడహాక్‌ కమిటీ సమావేశంలో సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 14:

జాతీయవాద భావాలు కలిగిన ఉద్యోగులంతా ఐక్యంగా ఉండి, ఉద్యోగుల సంక్షేమానికి సమష్టిగా కృషి చేయాలని బీఎంఎస్‌/నేషనల్‌ స్టేట్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ మహాసంఘ్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి రామ్మోహన్‌ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్‌ విధానాన్ని ప్రవేశపెట్టి, వారి భవిష్యత్తుకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

చిక్కడపల్లిలోని తెలంగాణ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (టీజీఈఎఫ్‌) రాష్ట్ర కార్యాలయంలో శనివారం రాష్ట్ర అడహాక్‌ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ కన్వీనర్‌ ఇ. వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి రామ్మోహన్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, ఐక్యతే ఫెడరేషన్‌ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకోవాలని కోరారు.

సమావేశంలో రాష్ట్ర అడహాక్‌ కమిటీ కోకన్వీనర్‌ ఎస్‌. ప్రద్యుమ్న, సభ్యులు జి. అనిల్‌కుమార్‌, ఎ. కృష్ణవర్ధన్‌, శ్రీరాం సుధాకర్‌, ఎ. శ్రీనివాస్‌, ఎ. గంగాధర్‌, కె. లక్ష్మిపతి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →