బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,716+2.05%
NIFTY25,768+2.14%
22K₹1,12,787/10g+1.24%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

బీసీ–ఏ కులాల ప్రయోజనాలకు భంగం కలిగిస్తే సహించం సీఎం ప్రకటన వెనక్కి తీసుకోవాలి.. సబ్‌కమిటీని రద్దు చేయాలి

nagendraఆదివారం, 15 నవంబర్ 2026 · 5:01 AM3 వీక్షణలుtrinetnews.com
బీసీ–ఏ కులాల ప్రయోజనాలకు భంగం కలిగిస్తే సహించం సీఎం ప్రకటన వెనక్కి తీసుకోవాలి.. సబ్‌కమిటీని రద్దు చేయాలి

ఓయూలో రౌండ్‌టేబుల్‌ సమావేశంలో కల్లెట్లపల్లి వెంకట్‌ డిమాండ్‌

సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 14: బీసీ–ఏ కేటగిరీలోని అత్యంత వెనుకబడిన కులాల ప్రయోజనాలకు భంగం కలిగించే నిర్ణయాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి కల్లెట్లపల్లి వెంకట్‌ డిమాండ్‌ చేశారు. బీసీ–ఏ కులాల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాల వేదికగా నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీసీ–ఏ కేటగిరీలోని 58 కులాలు తరతరాలుగా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నాయని వెంకట్‌ పేర్కొన్నారు. సంచార, అర్ధసంచార, సేవా వృత్తులపై ఆధారపడిన అనేక కుటుంబాలకు కనీస జీవన సౌకర్యాలు కూడా అందడం లేదన్నారు. ఆయా వర్గాల విద్యార్థుల్లో ఉన్నత విద్యకు చేరుకునేవారి సంఖ్య పరిమితంగా ఉందని తెలిపారు.

ఈ పరిస్థితుల్లో సామాజికంగా, రాజకీయంగా బలంగా ఉన్న మరో వర్గానికి బీసీ–ఏ కేటగిరీలో అవకాశం కల్పించాలనే ఆలోచన తమకు నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని, సంబంధిత సబ్‌కమిటీని రద్దు చేయాలని కోరారు. బీసీ–ఏ కులాల విద్య, ఉద్యోగ, రాజకీయ ప్రాతినిధ్యంపై సమగ్ర అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

కొన్ని ప్రాంతాల్లో నకిలీ కుల ధ్రువపత్రాలతో ఇతరులు రిజర్వేషన్‌ ప్రయోజనాలు పొందుతున్నారనే ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరిపి అక్రమాలను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కూడా అత్యంత వెనుకబడిన కులాలకు ఆశించిన గుర్తింపు, ప్రాతినిధ్యం లభించడం లేదని విమర్శించారు.

బీసీ–ఏ కులాల ప్రజలు విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా హక్కుల సాధనకు ముందుకు రావాలని వెంకట్‌ పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా స్థాయిల వరకు సంఘటితమై ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. రాబోయే ఎమ్మెల్సీ, స్థానిక సంస్థలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ రాజకీయ బలాన్ని చాటుతామన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సముచిత వాటా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →