బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,716+2.05%
NIFTY25,768+2.14%
22K₹1,12,787/10g+1.24%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

ఆర్టీసీ నెలవారీ పాస్‌లపై తొమ్మిది రాయితీలు మహిళలకు 15 రోజుల ప్రయాణ చార్జీతో నెలవారీ ఎంఎస్‌టీ

nagendraశనివారం, 14 నవంబర్ 2026 · 4:33 AM6 వీక్షణలుtrinetnews.com
ఆర్టీసీ నెలవారీ పాస్‌లపై తొమ్మిది రాయితీలు మహిళలకు 15 రోజుల ప్రయాణ చార్జీతో నెలవారీ ఎంఎస్‌టీ

నవంబర్ 14 నుంచి అమలు.. ఆదివారాల్లో సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 13:

నిత్య ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు నెలవారీ సీజన్ టికెట్లపై (ఎంఎస్‌టీ) తొమ్మిది రకాల రాయితీలు, అదనపు సౌకర్యాలను ప్రకటించినట్లు టీజీఎస్ ఆర్టీసీ పీఆర్వో కార్యాలయం వెల్లడించింది. నవంబర్ 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ సదుపాయాలు అమల్లోకి రానున్నాయని తెలిపింది. మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

కొత్త విధానంలో ఎంఎస్‌టీ జారీకి ఇప్పటివరకు ఉన్న దూర పరిమితిని తొలగించారు. నిర్దేశిత రూట్‌, చార్జీల నిబంధనలకు అనుగుణంగా పాస్‌లు పొందవచ్చు. పాస్ ధరలో టోల్ చార్జీలను గతంలో 25 రోజులకు లెక్కించగా, ఇకపై 20 రోజులకు మాత్రమే లెక్కించనున్నారు. కొత్తగా ప్రవేశపెట్టే డీలక్స్ నెలవారీ పాస్‌తో డీలక్స్‌, ఈ–డీలక్స్ బస్సుల్లో ప్రయాణించవచ్చు.

ఎంఎస్‌టీ కలిగిన వారికి హైదరాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌, నల్గొండ, కరీంనగర్ నగరాల్లో అన్ని కేటగిరీల సిటీ బస్సుల్లో ప్రతి ఆదివారం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. హైదరాబాద్‌లోని పుష్పక్ ఎయిర్‌పోర్ట్ లైనర్ సర్వీసులకు ఈ వెసులుబాటు వర్తించదు. ఆదివారం కాకుండా ఇతర ప్రభుత్వ సెలవు రోజుల్లో ఈ సౌకర్యం ఉండదని స్పష్టం చేశారు.

కాంబి టికెట్ విధానంలో పల్లెవెలుగు ఎంఎస్‌టీదారులు ఒక్కో ప్రయాణానికి అదనంగా రూ.20 చెల్లించి ఎక్స్‌ప్రెస్‌, ఈ–ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఎక్స్‌ప్రెస్ పాస్‌దారులు అదనంగా రూ.20తో డీలక్స్‌, ఈ–డీలక్స్ సేవలను వినియోగించుకోవచ్చు. పల్లెవెలుగు పాస్‌తో డీలక్స్‌, ఈ–డీలక్స్ బస్సుల్లో ప్రయాణానికి అనుమతి ఉండదు.

పాస్‌లో పేర్కొన్న రూట్ కాకుండా ఇతర మార్గాల్లో ప్రయాణించే ఎంఎస్‌టీదారులకు సూపర్ లగ్జరీ, ఆపై స్థాయి బస్సుల బేసిక్ టికెట్ చార్జీపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నారు. రెండు నెలల పాస్‌కు అదనంగా ఐదు రోజులు, మూడు నెలల పాస్‌కు పది రోజుల వ్యాలిడిటీని అదనపు రుసుము లేకుండా కల్పించనున్నారు.

మహిళల నెలవారీ పాస్ ధరను టోల్ చార్జీలతో సహా కేవలం 15 రోజుల ప్రయాణ ఖర్చు ఆధారంగా నిర్ణయించనున్నారు. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, పొదుపైన సేవలు అందించడమే ఈ నిర్ణయాల లక్ష్యమని సంస్థ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →