బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,716+2.05%
NIFTY25,768+2.14%
22K₹1,12,787/10g+1.24%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

చికెన్ వ్యర్థాల సేకరణకు పరిహారం ఇవ్వాలి మల్కాజిగిరి కార్పొరేషన్ అధికారులకు చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ వినతి

nagendraశనివారం, 14 నవంబర్ 2026 · 4:32 AM6 వీక్షణలుtrinetnews.com
చికెన్ వ్యర్థాల సేకరణకు పరిహారం ఇవ్వాలి మల్కాజిగిరి కార్పొరేషన్ అధికారులకు చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ వినతి

వారం రోజుల్లో నిర్ణయం తెలియజేస్తామన్న వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్

సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 13:

చికెన్ షాపుల నుంచి వెలువడే వ్యర్థాల సేకరణకు న్యాయమైన పరిహారం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ కోరింది. వ్యర్థాల సేకరణ, తరలింపునకు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ విడుదల చేసిన టెండర్ నోటిఫికేషన్‌పై షాపు యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

అసోసియేషన్ అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి వరుణ్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు శుక్రవారం తార్నాకలోని కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, విజిలెన్స్ అధికారి అమృత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. చికెన్ వ్యర్థాలను నేరుగా రెండరింగ్ ప్లాంట్లకు తరలించి శాస్త్రీయంగా ప్రాసెస్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్లు, చెరువుల్లో వ్యర్థాలను పడేయడం వల్ల కలిగే పర్యావరణ నష్టాన్ని నివారించడంతోపాటు వాటిని డాగ్ ఫీడ్, పౌల్ట్రీ ఫీడ్ తదితర అవసరాలకు వినియోగించేలా చేస్తున్నామన్నారు.

షాపు యజమానులకు కిలో ప్రాతిపదికన లేదా నెలవారీగా కొంత మొత్తం చెల్లించాలన్న విజ్ఞప్తిని పరిశీలిస్తామని చెప్పారు. టెండర్ పొందిన ఏజెన్సీలతో చర్చించి, సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి వారం రోజుల్లో నిర్ణయం తెలియజేస్తామని హామీ ఇచ్చారు.

అసోసియేషన్ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ.. చికెన్ షాపులపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయని, వారి ఉపాధికి నష్టం కలగకుండా అధికారులు, ఏజెన్సీలు మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. గతంలో వ్యర్థాల సేకరణకు కిలోకు రూ.4 వరకు చెల్లించేవారని పేర్కొంటూ, ప్రస్తుతం కూడా న్యాయమైన పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యపై అధికారులు సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →