బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,716+2.05%
NIFTY25,768+2.14%
22K₹1,12,787/10g+1.24%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

ఓసీపీ–3 కార్మికుల సమస్యలను పరిష్కరించాలి: టీబీజీకేఎస్ భద్రతా పరికరాలు, క్యాడర్ స్కీమ్ అమలుపై యాజమాన్యానికి వినతి

nagendraశనివారం, 14 నవంబర్ 2026 · 4:25 AM6 వీక్షణలుtrinetnews.com
ఓసీపీ–3 కార్మికుల సమస్యలను పరిష్కరించాలి: టీబీజీకేఎస్ భద్రతా పరికరాలు, క్యాడర్ స్కీమ్ అమలుపై యాజమాన్యానికి వినతి

గోదావరిఖని, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 13:

ఆర్జీ–2 పరిధిలోని ఓసీపీ–3 ఎస్‌అండ్‌డీ సెక్షన్‌లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) కోరింది. సంఘం ఫిట్ సెక్రటరీ దాసరి శ్రీనివాస్, సెంట్రల్ కమిటీ సభ్యుడు బొడ్డు రమేష్ ఆధ్వర్యంలో నాయకులు యాక్టింగ్ హెచ్‌ఓడీ రామకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు.

విద్యుత్ పనులు నిర్వహించే కార్మికులకు అవసరమైన భద్రతా పరికరాలు, ప్రత్యేక రక్షణ కల్పించాలని కోరారు. హెవీ డ్యూటీ యంత్రాలపై పనిచేస్తున్న అర్హులైన ఎలక్ట్రికల్ కార్మికులకు బీ–గ్రేడ్ యాక్టింగ్ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. డ్రైవర్లకు గత రెండేళ్లుగా నాణ్యమైన భద్రతా షూలు సక్రమంగా అందడం లేదని పేర్కొంటూ, వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

డంపర్ల రాకపోకలతో ఏర్పడుతున్న దుమ్మును నియంత్రించేందుకు క్రమం తప్పకుండా నీటిని చల్లాలని, డ్రైవర్లకు అర్హతలు, అనుభవం ఆధారంగా క్యాడర్ స్కీమ్ అమలు చేయాలని కోరారు. నాణ్యమైన పనిముట్లు తగినన్ని అందించడంతోపాటు మొబైల్ సర్వీస్ వ్యాన్లకు అవసరమైన విడిభాగాలు సమకూర్చాలని సూచించారు. వెల్డర్ల కొరతను అధిగమించేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని, షావెల్ మరమ్మతుల సమయంలో ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కార్మికుల ఆరోగ్యం, పని భద్రతతో ముడిపడిన ఈ సమస్యలపై యాజమాన్యం తక్షణమే స్పందించాలని నాయకులు కోరారు. పరిష్కారం సాధించే వరకు కార్మికుల పక్షాన నిలబడతామని తెలిపారు.

కార్యక్రమంలో కొప్పుల శ్రీనాథ్, సురేష్, బాలరాజు, నరేష్, కొప్పుల శ్రీనివాస్, వెంకటేష్, పాషా, తిరుపతి రెడ్డి, రాజశేఖర్, గోపికృష్ణ, రామారావు, శ్రీనివాస్, రమేష్ తదితర నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →