బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,881+2.25%
NIFTY25,800+2.27%
22K₹1,12,510/10g+1.04%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కేంద్రంగా హైదరాబాద్

nagendraఆదివారం, 8 నవంబర్ 2026 · 7:46 AM18 వీక్షణలుtrinetnews.com
గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కేంద్రంగా హైదరాబాద్

* "ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ ఎకోసిస్టమ్" బలోపేతంపై ప్రత్యేక దృష్టి

* ‘ఆర్థా ఫిన్‌టెక్’ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 7:

ఫిన్‌టెక్, గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలకు హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లో పరిశోధన, అభివృద్ధి( ఆర్ అండ్ డీ)కి ప్రోత్సాహం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దడంపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్థా ఫిన్‌టెక్ హైదరాబాద్‌ కార్యాలయాన్ని శనివారం హైటెక్ సిటీలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ఐటీ/ఐటీఈఎస్ రంగంలో హైదరాబాద్ సాధించిన అంతర్జాతీయ గుర్తింపును ఫిన్‌టెక్, డిజిటల్ బ్యాంకింగ్, గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలకూ విస్తరించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ రైజింగ్–2047 విజన్‌లో భాగంగా పెట్టుబడులకు, ఆవిష్కరణలకు, ఎమర్జింగ్ టెక్నాలజీస్ కు దేశంలోనే అత్యుత్తమ గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. గ్లోబల్ కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్ కు విస్తరించేలా "ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ ఎకో సిస్టం"ను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. బ్యాంకింగ్-యాజ్-ఏ-సర్వీస్, ఓపెన్ బ్యాంకింగ్ ఏపీఐలు, ఆటోమేటెడ్ ఆన్‌బోర్డింగ్, కేవైసీ/కేవైబీ, ఏఎంఎల్, అంతర్జాతీయ చెల్లింపులు, డిజిటల్ వాలెట్ మౌలిక సదుపాయాలు తదితర ఫైనాన్షియల్ టెక్నాలజీ పరిష్కారాలను ఆర్థా ఫిన్ టెక్ అందిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. కార్యక్రమంలో ఆర్థా ఫిన్ టెక్ సీఈఓ మధు బాబు గడిపాటి, ఆర్మిన్ ఒర్డోడరీ, ఇమాన్యుయేల్ సి. ఫెర్నాండెస్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →