బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,881+2.25%
NIFTY25,800+2.27%
22K₹1,12,510/10g+1.04%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం అమలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

nagendraశనివారం, 7 నవంబర్ 2026 · 5:28 AM5 వీక్షణలుtrinetnews.com
న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం అమలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 06:

న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (NEHS) పథకం అమలులో ఉద్యోగులు, పెన్షనర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.

శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఎన్‌ఈహెచ్‌ఎస్ బోర్డు సమావేశంలో ఉన్నతాధికారులు, బోర్డు సభ్యులు, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి పథకం అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు లేవనెత్తిన సమస్యలు, ముఖ్యంగా ఆసుపత్రుల్లో అడ్మిషన్లు, వైద్య చికిత్సలు, బిల్లుల చెల్లింపులు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం యశోద, అపోలో, కిమ్స్ తదితర కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో ఆన్‌లైన్ ద్వారా మాట్లాడిన ప్రధాన కార్యదర్శి, ఉద్యోగ సంఘాల నాయకులు చేసిన ఫిర్యాదులపై ఆసుపత్రుల ప్రతినిధులను వివరణ కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్‌ఈహెచ్‌ఎస్ పరిధిలోని రోగులకు ఆసుపత్రుల్లో అడ్మిషన్లు నిరాకరించకూడదని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న పాత బిల్లులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, చికిత్సకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.

ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. వైద్య చికిత్సల ధరల్లో పారదర్శకత, ఏకరూపత ఉండేలా చర్యలు తీసుకోవాలని, ధరలను క్రమబద్ధీకరించడంతో పాటు జవాబుదారీతనాన్ని పెంపొందించాలని ఆదేశించారు. చికిత్సల ఛార్జీల విషయంలో సీజీహెచ్‌ఎస్ (CGHS) నిర్దేశించిన ధరలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బి.ఎం.డి. ఎక్కా, నవీన్ మిట్టల్, ముఖ్య కార్యదర్శులు క్రిస్టినా చోంగ్తు, యోగితా రాణా, శిఖా గోయల్, సర్ఫరాజ్ అహ్మద్, గౌరవ్ ఉప్పల్, శృతి ఓజా, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ, ఇతర ఉన్నతాధికారులు, బోర్డు సభ్యులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →