బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,881+2.25%
NIFTY25,800+2.27%
22K₹1,12,510/10g+1.04%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

కీలక ఖనిజరంగంలో అమెరికన్ సంస్థలతో పనిచేసేందుకు సిద్ధం కీలక ఖనిజ విస్తరణపై యూఎస్ కాన్సులేట్ బృందానికి వివరించిన సింగరేణి కీలక ఖనిజరంగంలో సాంకేతిక,

nagendraశనివారం, 7 నవంబర్ 2026 · 5:22 AM6 వీక్షణలుtrinetnews.com
కీలక ఖనిజరంగంలో అమెరికన్ సంస్థలతో పనిచేసేందుకు సిద్ధం కీలక ఖనిజ విస్తరణపై యూఎస్ కాన్సులేట్ బృందానికి వివరించిన సింగరేణి కీలక ఖనిజరంగంలో సాంకేతిక,

వ్యాపార భాగస్వామ్యానికి అమెరికాలో అనేక అవకాశాలు

సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధి బృందం భేటీ

సింగరేణి భవన్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 06:

కీలక ఖనిజ రంగంలో సాంకేతిక, ఉమ్మడి భాగస్వామ్యం, తదితర అంశాలపై హైదరాబాద్ అమెరికన్ కాన్సులేట్ కు చెందిన పొలిటికల్ ఎకనామిక్ చీఫ్ మెరెడిత్ మెజ్లర్ సారథ్యంలోని ఉన్నత స్థాయి అధికారుల బృందం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ సింగరేణి భవన్ లో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థతో పలు వ్యాపార సంబంధ అంశాలు, అవకాశాలపై ఇరు పక్షాల వారు సుదీర్ఘంగా చర్చించారు. మైనింగ్ రంగంలో అపార అనుభవం గల సింగరేణి సంస్థ కీలక ఖనిజరంగంలోకి ప్రవేశించిందని, ఇప్పటికే పలు దేశాలతో ఉమ్మడి భాగస్వామ్యం, సాంకేతిక సహకారంపై చర్చిస్తోందని సంస్థ ఛైర్మన్ వివరించారు.

దీనిపై అమెరికన్ బృందం వారు స్పందిస్తూ తమ దేశంలో కీలక ఖనిజ రంగంలో ఉన్న పలు సంస్థలతో కలిసి పని చేయడానికి అవకాశాలు ఉన్నాయని వివరించారు. సింగరేణి సంస్థ ఇటీవల కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన జియో సైన్స్ ల్యాబొరేటరీలో ఉన్న సౌకర్యాలు, ఓపెన్ కాస్ట్ గనుల ఓవర్ బర్డెన్ లో దాగి ఉన్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటి అంశాలపై కూడా అమెరికన్ బృందం ఆసక్తి చూపించింది.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రోత్సాహం, సహకారంతో సింగరేణి కీలక ఖనిజ రంగంలో ముందుకువెళ్తోందని సీఎండీ పేర్కొన్నారు. కీలక ఖనిజ రంగంలో విదేశీ పెట్టుబడులను, సాంకేతిక మరియు పరిశోధన సంస్థల భాగస్వామ్యాన్ని సింగరేణి సంస్థ కోరుతోందని వివరించారు. అమెరికాలో పలు సంస్థలు ఇటువంటి ఆసక్తిని కలిగి ఉన్నాయని కాన్సులేట్ సభ్యులు తెలియజేశారు ఏప్రిల్ లో అమెరికాలో జరిగే కీలక ఖనిజ సదస్సులో పాల్గొనవలసిందిగా సింగరేణిని ఆహ్వానించారు.

నేటి ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో డాటా సెంటర్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను శోధిస్తున్నామని, తెలంగాణలో సింగరేణి ప్రాంతంలో కూడా వీటి ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని అమెరికన్ ప్రతినిధులు తెలిపారు.

మూతపడిన ఓపెన్ కాస్ట్ గనులను సద్వినియోగం చేసేందుకు సింగరేణి పలు ప్రాంతాల్లో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, డాటా సెంటర్లకు పీక్ అవర్స్ లో నిరంతరాయ విద్యుత్ అందించటం కోసం ఈ ప్లాంట్ లు ఉపయోగపడతాయని సింగరేణి అధికారులు వివరించారు. తగిన పెట్టుబడి, భాగస్వామ్యంతో ఈ ప్లాంట్ లను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అలాగే సమీపంలో గోదావరి నది నుండి కూడా నీటిని వినియోగించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు అమెరికన్ కంపెనీలు డాటా సెంటర్ లు ఏర్పాటు చేశాయని, మరికొన్ని కంపెనీలు కూడా వీటి ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయని.. తెలంగాణ ప్రాంతంలో ఉన్న సౌకర్యాలు వీటి ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్లు అమెరికన్ కాన్సులేట్ సభ్యులు వివరించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ అమెరికన్ బృందాన్ని సింగరేణి గనులను మరియు జియో సైన్స్ ల్యాబ్ ను సందర్శించాలని ఆహ్వానించారు.

ఈ సమావేశంలో అమెరికన్ కాన్సులేట్ బృందానికి చెందిన పొలిటికల్ మరియు ఎకనామిక్ చీఫ్ మెరెడిత్ మెజ్లర్, పొలిటికల్, ఎకనామిక్ స్పెషలిస్ట్ లు శ్రీమలి కరి, శిబా త్రిపాఠి, కమర్షియల్ స్పెషలిస్ట్ సునేల్ కుమ్మర్, సింగరేణి సంస్థ తరఫున ఛైర్మన్ తో పాటు డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు, జనరల్ మేనేజర్ (మార్కెటింగ్ మరియు కోఆర్డినేషన్) టి. శ్రీనివాస్, జనరల్ మేనేజర్ (బిజినెస్ డెవలప్ మెంట్) కె. రామదాసు, జనరల్ మేనేజర్ (ఎక్స్ ప్లోరేషన్) పంకజ్ కులశ్రేష్ట, జనరల్ మేనేజర్ (పవర్ ప్రాజెక్ట్స్) గురు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →