బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,881+2.25%
NIFTY25,800+2.27%
22K₹1,12,510/10g+1.04%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

మైనార్టీల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట ‎‎విద్య, సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ‎

nagendraశనివారం, 7 నవంబర్ 2026 · 4:58 AM7 వీక్షణలుtrinetnews.com
మైనార్టీల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట ‎‎విద్య, సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ‎

‎ఓల్డ్ సిటీ అభివృద్ధికి భారీగా నిధుల కేటాయింపు

‎‎హజ్‌హౌస్‌ పక్కన అసంపూర్తి భవన నిర్మాణానికి రూ.25 కోట్లు

‎‎మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు మరింత విస్తృతం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 6: ‎ ‎మైనార్టీల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వారి సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ అవసరమైన నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. మైనార్టీ విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడంతో పాటు వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు.

‎‎గత అసెంబ్లీ సమావేశంలో మైనార్టీల అభ్యున్నతి గురించి సమీక్ష నిర్వహిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీలో భాగంగా శుక్రవారం ప్రజాభవన్‌లో మైనార్టీ సంక్షేమ శాఖపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ తో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మైనార్టీల విద్యాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, విద్యాసంస్థల నిర్మాణాలు, స్టడీ సర్కిళ్ల ఏర్పాటు, ఓల్డ్ సిటీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు. మైనార్టీలకు విద్యా అవకాశాలను మరింత విస్తృతం చేసేందుకు నిధుల విడుదలలో ఎలాంటి జాప్యం, ఆంక్షలు ఉండబోవని భరోసా ఇచ్చారు. నాంపల్లిలోని హజ్‌హౌస్‌ పక్కన కొన్నేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన బహుళ అంతస్తుల భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు.  వివిధ రహదారుల విస్తరణ పనుల కోసం వినియోగించిన వక్ఫ్‌ భూములకు సంబంధించి జీహెచ్‌ఎంసీ నుంచి వక్ఫ్‌ బోర్డుకు రావాల్సిన నిధుల్లో రూ.25 కోట్లను ఈ భవన నిర్మాణం కోసం కేటాయించాలని ఆదేశించారు. నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ భవనంలో మైనార్టీ విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్‌తో పాటు మైనార్టీ సంక్షేమ శాఖకు చెందిన వివిధ కార్యాలయాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

‎విద్యాసంస్థల భవన నిర్మాణాలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం ఉండదని  స్పష్టం చేశారు. మైనార్టీ విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహదపడే పాఠశాలలు, స్టడీ సర్కిళ్లు, ఇతర విద్యాసంస్థలకు అవసరమైన నిధులను సకాలంలో విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. మొఘల్‌పురా, బండ్లగూడ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన రెండు స్టడీ సర్కిళ్లకు సంబంధించి ఉన్న అడ్డంకులను తొలగించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. ఈ రెండు ప్రాంతాల్లో స్టడీ సర్కిళ్ల నిర్వహణకు అవసరమైన భవనాలను అందించేందుకు అక్బరుద్దీన్‌ ఒవైసీ సంసిద్ధత వ్యక్తం చేయగా, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారికంగా సమర్పించాలని కోరారు.

‎‎మైనార్టీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం పరిధిని  విస్తరిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ పథకం కింద ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అర్హులైన విద్యార్థులు వెళ్లగలిగే దేశాల జాబితాలో ఈజిప్ట్‌, సౌదీ అరేబియాలను చేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు.

‎మైనార్టీల సంక్షేమానికి సంబంధించిన షాదీ ముబారక్‌ పథకం, ఇస్లామిక్‌ కల్చరల్‌ సెంటర్‌కు ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపు, రాజీవ్‌ యువ వికాసం పథకం కింద మైనార్టీల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కారం, ప్రీ-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల విడుదల తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు. క్రైస్తవ మైనార్టీలకు సంబంధించిన సమస్యలను సైతం పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని  హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని అధికారులకు సూచించారు.

‎మైనార్టీల విద్యా, సామాజిక, ఆర్థిక అభివృద్ధితో పాటు హైదరాబాద్‌ ఓల్డ్ సిటీలో మౌలిక వసతుల మెరుగుదల, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా  స్పష్టం చేశారు. ఈ సమావేశంలో శాసనసభలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ, మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్‌ నదీమ్‌, కార్యదర్శి బి. షఫీఉల్లా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి. కర్ణన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

‎

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →