బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,881+2.25%
NIFTY25,800+2.27%
22K₹1,12,510/10g+1.04%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

వాటర్ ట్యాంకర్ల సమ్మె విరమణ హర్షణీయం — సమస్య పరిష్కరించినందుకు హైడ్రాకు అభినందనలు

nagendraగురువారం, 5 నవంబర్ 2026 · 4:41 AM13 వీక్షణలుtrinetnews.com
వాటర్ ట్యాంకర్ల సమ్మె విరమణ హర్షణీయం — సమస్య పరిష్కరించినందుకు హైడ్రాకు అభినందనలు

— హైడ్రా కమిషనర్ ను కలసి కృతజ్ఞతలు తెలిపిన హాస్టళ్ల నిర్వాహకులు

హైదరాబాద్ , ట్రైనెట్ న్యూస్, నవంబర్ 4:

హైదరాబాద్‌లో నీటి ట్యాంకర్ల యజమానులు సమ్మె విరమించడం పట్ల హాస్టళ్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. వాటర్ ట్యాంకర్ల యజమానులతో వెంటనే మాట్లాడి సమస్యను పరిష్కరించినందుకు గాను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం హాస్టళ్ల నిర్వాహకుల సంఘం ప్రతినిధులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ని కలిసారు. హాస్టళ్లకు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా సమస్య పరిష్కారానికి చొరవ చూపిన హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ కి హాస్టళ్ల యజమానుల సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. జీవనోపాధి, విద్య, ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది వస్తున్నారని, నగరంలోని హాస్టళ్లలో వేలాది మంది ఉంటూ నీటి అవసరాల కోసం ట్యాంకర్ల సరఫరాపై ఆధారపడుతున్నారని వారు పేర్కొన్నారు. నీటి ట్యాంకర్ల సమ్మె కొనసాగితే హాస్టళ్లలో ఉంటున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ట్యాంకర్ల యజమానులతో చర్చించి... నగరంలోని జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలపై ఒత్తిడి పెరగకుండా, తక్కువ జనసాంద్రత కలిగిన ప్యూర్(పేరి అర్బన్ రీజియన్ ) ప్రాంతాల నుంచి నీటిని సేకరించి వ్యాపార కార్యకలాపాలు సాగించాలని ఎంతో దూర దృష్టితో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించిన విషయాన్ని వాటర్ ట్యాంకర్ల యజమానులు దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. ఈ సూచనతో ట్యాంకర్ల యజమానులు సమ్మె విరమించి నీటి సరఫరాలను పునరుద్ధరించేందుకు అంగీకరించడం హర్షణీయమని హాస్టళ్ల యజమానుల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగులకు నీటి సరఫరా సమస్య తలెత్తకుండా పరిష్కార మార్గం చూపినందుకు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ కి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →