బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,973+2.37%
NIFTY25,791+2.23%
22K₹1,12,612/10g+1.14%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

డీప్‌టెక్, ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ

పారిశ్రామిక రంగం వృద్ధి రేటు 8.1 శాతం... రూ.3.04 లక్షల కోట్లకు జీఎస్‌వీఏ ఎమర్జింగ్ టెక్నాలజీస్, పరిశ్రమలు, తయారీ రంగాలకు ప్రాధాన్యం ఫిక్కీ వందేళ్ల వేడుకలు, ‘తెలంగాణ డీప్ – టెక్ లీడర్ షిప్ సమ్మిట్’లో మంత్రి శ్రీధర్ బాబు

nagendraగురువారం, 5 నవంబర్ 2026 · 4:22 AM3 వీక్షణలుtrinetnews.com
డీప్‌టెక్, ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 4:

తెలంగాణను ప్రపంచ స్థాయి డీప్‌టెక్, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయబోయే ఏఐ, క్వాంటం టెక్నాలజీ, రోబోటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, సెమీకండక్టర్లు, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. బుధవారం బేగంపేట్ లోని ఐటీసీ కాకతీయలో నిర్వహించిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) వందేళ్ల వేడుకలు, ‘తెలంగాణ డీప్ – టెక్ లీడర్ షిప్ సమ్మిట్’లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ఫిక్కీ వందేళ్ల ప్రస్థానం భారత పారిశ్రామిక రంగ పరిణామానికి అద్దం పడుతోందన్నారు. 2025–26లో రాష్ట్ర జీఎస్‌వీఏలో పారిశ్రామిక రంగం వాటా 8.1 శాతం వృద్ధి రేటుతో రూ.3.04 లక్షల కోట్లకు చేరిందన్నారు. స్టేట్ మర్చండైజ్ ఎక్స్ పోర్ట్స్ 39.3 శాతం పెరిగాయన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఎమర్జింగ్ టెక్నాలజీస్, పరిశ్రమలు, తయారీ రంగాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ప్రభుత్వం, పరిశ్రమలు, సంస్థల సమష్ఠి భాగస్వామ్యంతోనే ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, నిపుణులు, ఆవిష్కర్తలను ఆయన ఆహ్వానించారు. కార్యక్రమంలో ఫిక్కీ తెలంగాణ ఛాప్టర్ ఛైర్మన్ వి.వి. రామరాజు, కో - ఛైర్మన్ జయదేవ్ మీలా, ఎఫ్ టీసీసీఐ ప్రెసిడెంట్ కె.కె.మహేశ్వరి, అపోలో హాస్పిటల్స్ ఎంటర్ ప్రైజెస్ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →