శుక్రవారం30 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX74,460+1.16%
NIFTY23,053+1.32%
22K₹1,30,268/10g-1.05%
భాషలు

తెలంగాణ వార్తలు

భావ కవితా యుగ కర్త దేవులపల్లి కృష్ణ శాస్త్రి

భావ కవితా యుగ కర్త దేవులపల్లి కృష్ణ శాస్త్రి హైదరాబాద్ , చిక్కడపల్లి , ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 30: గురజాడ అప్పారావు అభ్యుదయ సాహితీ యుగ కార్త కాగా రాయప్రోలు సుబ్బారావు భావ కవిత్వ యుగ కర్త ఆయనను అనుసరించి కొనసాగించిన వార

Staff Reporter30 October 2026, 8:03 AM2 చూసులుtrinetnews.com
భావ కవితా యుగ కర్త దేవులపల్లి కృష్ణ శాస్త్రి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

భావ కవితా యుగ కర్త దేవులపల్లి కృష్ణ శాస్త్రి

హైదరాబాద్ , చిక్కడపల్లి , ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 30: గురజాడ అప్పారావు అభ్యుదయ సాహితీ యుగ కార్త కాగా రాయప్రోలు సుబ్బారావు భావ కవిత్వ యుగ కర్త ఆయనను అనుసరించి కొనసాగించిన వారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి అని రాష్ట్ర హస్త కళల అభివృద్ధి సంస్థ నాయుడు సత్యనారాయణ చెప్పారు శ్రీ త్యాగరాయ గానసభ లోని కళా సుబ్బారావు కళా వేదిక పై గాన సభ నిర్వహణలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యం తో జరుగుతున్న ఎందరో మహానుభావులు కార్యక్రమ పరంపర లో భాగంగా దేవులపల్లి కృష్ణ శాస్త్రి జయంతి సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న నాయుడు సత్యనారాయణ మాట్లాడుతూ దేవులపల్లి కృష్ణ శాస్త్రి కృష్ణ పక్షం కావ్యం భావ కవిత్వం ను పతాక స్థాయి లో నిలిపింది అని వివరించారు మహా కవి శ్రీ శ్రీ ప్రజల బాధ తన బాధ గా సాహిత్య రచన చేస్తే దేవులపల్లి తన బాధ ప్రజల బాధగా ప్రేమ విరహం అంశాలు గా రచన చేశారని ప్రముఖ సాహితీ వేత్త చలం చెప్పిన మాటలు గుర్తు చేశారు అధ్యక్తత వహించిన గాన సభ అధ్యక్షుడు కళా జనార్థన మూర్తి మాట్లాడుతూ కృష్ణ శాస్త్రి సినీ పాటలు సాహిత్య గుబాళింపు లనీ ముఖ్యం గా జయ జయ భారత జానయత్రీ, ఆకులో ఆకునై వంటి గీతలు ఎవర్ గ్రీన్ అని చెప్పారు సాహితీ కిరణం సంపాదకుడు పొత్తూరి సుబ్బారావు గాయకుడు సుబ్రహ్మణ్యం గాయని రత్న మాల పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి