బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,932+2.32%
NIFTY25,819+2.34%
22K₹1,12,547/10g+1.10%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

గచ్చిబౌలిలో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్...

డిజైనింగ్ నుంచి బ్రాండింగ్ వరకు ఆర్టిజన్లకు మార్గనిర్దేశం రుక్మాపూర్ లో పర్యావరణహిత చర్మశుద్ధి కర్మాగారాలు టీజీఎల్ఐపీసీ సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు

nagendraఆదివారం, 25 అక్టోబర్ 2026 · 3:16 AM12 వీక్షణలుtrinetnews.com
గచ్చిబౌలిలో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్...

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 24:

రాష్ట్రంలో లెదర్ ఇండస్ట్రీని మరింత బలోపేతం చేయడంతో పాటు, ఔత్సాహిక ఎస్సీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు గచ్చిబౌలిలో ప్రత్యేకంగా కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్‌సీ)ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ లో సుమారు వేయి మందికి ఉపాధి కల్పించేలా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పర్యావరణహిత చర్మశుద్ధి కర్మాగారాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. శనివారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పోరేషన్(టీజీఎల్ఐపీసీ) ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో లెదర్ ఇండస్ట్రీ అభివృద్ధికి, ఆర్టిజన్లను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఎస్సీ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. అంతర్జాతీయ హంగులతో గచ్చిబౌలీలో హబ్ అండ్ స్పోక్ విధానంలో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న సీఎఫ్‌సీ ద్వారా రాష్ట్రంలోని ఆర్టిజన్ల ఉత్పత్తులకు అదనపు విలువ(వాల్యూ యాడెడ్)ను జోడిస్తామన్నారు. డిజైనింగ్ మొదలు బ్రాండింగ్ వరకు వారికి మార్గనిర్దేశం చేస్తామన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట, ఆర్మూర్ లో మైక్రో స్మాల్ ఎంటర్ ప్రైజెస్ క్లస్టర్ డెవలెప్ మెంట్ ప్రోగ్రాం (ఎంఎస్ఈసీడీపీ) కింద ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో లిడ్ క్యాప్ కు ఎక్కడెక్కడ భూములు కేటాయించారు... వాటి ప్రస్తుత పరిస్థితి ఏంటనే అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన నివేదిక అందజేయాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, టీజీఎల్ఐపీసీ వీసీ అండ్ ఎండీ ప్రశాంత్ కుమార్, తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ప్రెసిడెంట్ డా.ఆరేపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →