బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,938+2.32%
NIFTY25,819+2.34%
22K₹1,11,077/10g-0.21%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కల సాకారం చేస్తాం న్యాయపరమైన చిక్కులు లేకుండా నివాసయోగ్యమైన ప్రాంతంలో స్థలాలు ఇచ్చేందుకు కార్యాచరణ

nagendraఆదివారం, 25 అక్టోబర్ 2026 · 3:05 AM5 వీక్షణలుtrinetnews.com
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కల సాకారం చేస్తాం న్యాయపరమైన చిక్కులు లేకుండా నివాసయోగ్యమైన ప్రాంతంలో స్థలాలు ఇచ్చేందుకు కార్యాచరణ

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది

*రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 24: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టుల ఆకాంక్షలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టులకు చట్టపరమైన చిక్కులు లేని విధంగా, నివాసయోగ్యమైన ప్రాంతంలో ఇళ్ల స్థలాలు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని శ‌నివారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008 లో జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని మంత్రి గుర్తుచేశారు. అయితే, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించే ప్రక్రియ సుదీర్ఘకాలం నిలిచిపోయిందని తెలిపారు. 2022లో న్యాయపరమైన అడ్డంకులు తొలగిన తర్వాత కూడా గతంలో ఈ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై చొరవ తీసుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి 2024 సెప్టెంబర్ 8వ తేదీన రవీంద్ర భారతిలో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి భూమిని సొసైటీకి అప్పగించడం జ‌రిగింద‌న్నారు. అనంతరం సుప్రీంకోర్టు తుది ఉత్త‌ర్వుల నేపథ్యంలో మరోసారి న్యాయపరమైన సమస్యలు ఎదురుకావడంతో ఈ అంశానికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సహచర మంత్రులతో పలుమార్లు చర్చించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించే అంశంపై సమగ్రంగా సమీక్షించినట్లు మంత్రిగారు వెల్లడించారు.

జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేయాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. గతంలో ఎదురైన న్యాయపరమైన సమస్యలు పునరావృతం కాకుండా, చట్టపరమైన చిక్కులు లేని విధంగా, కుటుంబాలతో గౌరవంగా నివసించేందుకు అనువైన ప్రాంతంలో ఇళ్ల స్థలాలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంద‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. ఇప్ప‌టివ‌ర‌కు కూడా కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలోనే జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల‌స్ధ‌లాలు ఇవ్వ‌డం జ‌రిగిందని మ‌రోసారి కాంగ్రెస్ పాల‌న‌లోనే ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంతోపాటు, వారికి గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సొంతింటి కల నెరవేరేలా, అందరికీ ఆమోదయోగ్యమైన శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →