బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,881+2.25%
NIFTY25,800+2.27%
22K₹1,12,510/10g+1.04%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది: మంత్రి అడ్లూరి ఫామ్‌హౌస్‌లో కూర్చొని విషం చిమ్ముతున్నారు: ఎ మ్మెల్యే వేముల వీరేశం

nagendraఆదివారం, 25 అక్టోబర్ 2026 · 3:05 AM6 వీక్షణలుtrinetnews.com
కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది: మంత్రి అడ్లూరి ఫామ్‌హౌస్‌లో కూర్చొని విషం చిమ్ముతున్నారు: ఎ మ్మెల్యే వేముల వీరేశం

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 24: ఎల్ నినో ప్రభావం, కరవు పరిస్థితులపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని పరిస్థితులను వివరిస్తూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ వేముల వీరేశం విమర్శలు గుప్పించారు. కరోనా సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని మంత్రి అడ్లూరి ఆరోపించగా.. ఫామ్‌హౌస్‌లో కూర్చొని ప్రభుత్వంపై విమర్శలు చేయడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని వేముల వీరేశం మండిపడ్డారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ మీడియా హాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఎల్ నినోపై బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టారు.

కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది: మంత్రి అడ్లూరి

కరోనా మహమ్మారి సమయంలో తన సొంత చెల్లిని కోల్పోయానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి ఉంటే తన చెల్లి ప్రాణాలతో ఉండేదని వ్యాఖ్యానించారు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వ అసమర్థత కారణంగానే కరోనా మందులు బ్లాక్ మార్కెట్‌లోకి వెళ్లాయని ఆరోపించారు. ఆ సమయంలో కనీసం మాస్కులు కూడా అందించలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. మహమ్మారి సమయంలో కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆరోపించారు. కరోనా మరణాలకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహిస్తారా? అని అడ్లూరి ప్రశ్నించారు. కరోనా సంక్షోభ సమయంలో కాంగ్రెస్ పార్టీ హుందాగా వ్యవహరించిందని ఆయన పేర్కొన్నారు. కరవుకు కాంగ్రెస్ కారణమైతే, కరోనా సంక్షోభానికి బీఆర్ఎస్ కారణమా? అని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ నేతల విమర్శలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. ఎల్ నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపించే ప్రకృతి సంబంధిత పరిణామమని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులను రాజకీయాలతో ముడిపెట్టి విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందిస్తున్నారని, విపత్తుల సమయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని తెలిపారు. తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మంత్రి అడ్లూరి ధీమా వ్యక్తం చేశారు.

ఫామ్‌హౌస్‌లో కూర్చొని విషం చిమ్ముతున్నారు: వేముల వీరేశం

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ప్రభుత్వ విప్ వేముల వీరేశం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫామ్‌హౌస్‌లో కూర్చొని ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. కరవుకు కాంగ్రెస్ కారణమని చెప్పే కేసీఆర్‌ను సైంటిస్టుగా అభివర్ణిస్తూ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని ఆరోపించారు. కరోనా సంక్షోభానికి కేసీఆర్ కారణమని తాము చెప్పడం లేదని, అయితే కరవు పరిస్థితులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు సరికావని వీరేశం వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్‌లో నీటి ప్రవాహానికి కేసీఆర్ కారణమని, కేసీఆర్ వల్లే ఏపీకి నీళ్లు వచ్చాయని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని వేముల వీరేశం పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు బురదలో ఉంటూ ఇతరులపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎల్ నినో ప్రభావంపై రైతులను ప్రభుత్వం ఎప్పటి నుంచో అప్రమత్తం చేస్తోందని తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను చిల్లర మాటలు, చిల్లర వాగ్దానాలుగా అభివర్ణిస్తూ వీరేశం మండిపడ్డారు. కాగా, ఎల్ నినో ప్రభావం, కరవు పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ విమర్శలు మరింత తీవ్రతరం అవుతున్నాయి. ఒకవైపు గత ప్రభుత్వ హయాంలో కరోనా నిర్వహణలో వైఫల్యాలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుండగా.. మరోవైపు ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తుండటంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →