బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,938+2.32%
NIFTY25,819+2.34%
22K₹1,11,077/10g-0.21%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా గ్లోబల్ సమ్మిట్‌లో కళా ప్రదర్శనలు

nagendraగురువారం, 22 అక్టోబర్ 2026 · 2:08 AM5 వీక్షణలుtrinetnews.com
తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా గ్లోబల్ సమ్మిట్‌లో కళా ప్రదర్శనలు

డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026

సమ్మిట్ ప్రారంభోత్సవం, కల్చరల్ కార్నివాల్, ప్రచార కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలి

-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్,

అక్టోబర్ 21: తెలంగాణ గొప్ప సాంస్కృతిక, కళా వారసత్వాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పేలా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 సందర్భంగా జానపద, శాస్త్రీయ సంగీత, నృత్య కార్యక్రమాలతో పాటు వివిధ సాంస్కృతిక కళారూపాల ప్రదర్శనలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై బుధవారం సంబంధిత ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మిట్ నిర్వహణ, అతిథులకు స్వాగతం, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రచార వ్యూహాలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు హాజరుకానున్న ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ పెట్టుబడుల అవకాశాలతో పాటు రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని సీఎస్ సూచించారు. సమ్మిట్ ప్రారంభోత్సవం సందర్భంగా అతిథులకు ఘన స్వాగతం పలికేలా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ కళారూపాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. సమ్మిట్‌లో భాగంగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న రక్షా ఎక్స్‌పో చివరి రోజైన డిసెంబర్ 9న ఏర్పాటు చేయనున్న ఎయిర్ షోను వీక్షించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున, ఆ రోజున తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక కల్చరల్ కార్నివాల్ నిర్వహించాలని ఆదేశించారు.

సమ్మిట్‌కు విస్తృత ప్రచారం కల్పించాలి

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు కర్టెన్ రైజర్ కార్యక్రమాలను ఈ నెల 24న హైదరాబాద్‌లో, 29న న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించాలని సీఎస్ సూచించారు. సమ్మిట్, రక్షా ఎక్స్‌పోలకు సంబంధించిన సమాచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఆకర్షణీయమైన హోర్డింగులు ఏర్పాటు చేయాలన్నారు.

న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌తో పాటు ఇతర ప్రముఖ ప్రాంతాల్లోనూ ప్రచార హోర్డింగులు ఏర్పాటు చేయాలని, హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మార్గంతో పాటు నగరంలోని ప్రధాన రహదారులు, ప్రముఖ ప్రాంతాలు, స్టార్ హోటళ్ల వద్ద వెంటనే హోర్డింగులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయ స్థాయి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియా వేదికల ద్వారా సమ్మిట్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. సినీ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీల భాగస్వామ్యంతో ప్రత్యేక షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించి, సమ్మిట్ ప్రాధాన్యతను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్, కార్యదర్శులు హరిచందన, శశాంక, ముకుంద్ రెడ్డి, అజిత్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ సీపీఆర్ఓ మల్సూర్, డిజిటల్ విభాగం డైరెక్టర్ కర్రీ శ్రీరామ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →