బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,938+2.32%
NIFTY25,819+2.34%
22K₹1,10,998/10g-0.28%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

దసరాకు ఊరెళ్లే ప్రయాణికుల కోసం 7 వేల ప్రత్యేక బస్సులు: టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి ​జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్ ) లో ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించిన ఎండీ వై.నాగిరెడ్డి

nagendraశనివారం, 17 అక్టోబర్ 2026 · 4:46 AM4 వీక్షణలుtrinetnews.com
దసరాకు ఊరెళ్లే ప్రయాణికుల కోసం 7 వేల ప్రత్యేక బస్సులు: టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి ​జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్ ) లో ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించిన ఎండీ వై.నాగిరెడ్డి

ఇప్పటివరకు 95 శాతం ప్రత్యేక బస్సులను విజయవంతంగా నడిపిన టీజీఎస్ ఆర్టీసీ

​అక్టోబర్ 17, 18,19 తేదీల్లో రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడిపేందుకు ఆదేశాలు

​పండుగ తర్వాత తిరుగు ప్రయాణానికి కూడా భారీగా ప్రత్యేక సర్వీసులు సిద్ధం : ఎండీ నాగిరెడ్డి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 16: దసరా పండుగను పురస్కరించుకుని సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) 7 వేల ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ వీసీ & ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి ఇప్పటివరకు సుమారు 95 శాతం బస్సులను విజయవంతంగా నడిపి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామని వెల్లడించారు.

​శుక్రవారం హైదరాబాద్‌ జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్ ) ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (ఈడీలు) సిహెచ్. వెంకన్న, ఏ.శ్రీధర్‌లతో కలిసి ఎండీ నాగిరెడ్డి స్వయంగా పరిశీలించారు. జెబిఎస్ లో ప్రత్యేక విధులు నిర్వర్తిస్తున్న సికింద్రాబాద్ ఆర్ఎం సుచరిత, కరీంనగర్ ఆర్ఎం రాజు లతో బస్సుల నిర్వహణ, ట్రాఫిక్ కు సంబంధించి సమీక్షించారు. గంటకు పైగా బస్ స్టేషన్‌లో పర్యటించిన ఆయన ప్రయాణికులతో నేరుగా ముచ్చటించి, వారికి కల్పిస్తున్న ఏర్పాట్లు, సౌకర్యాలు మరియు మౌలిక వసతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్ స్టేషన్‌లో ప్రయాణికుల కోసం చేసిన ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

​ఈ సందర్భంగా ఎండీ వై.నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 17, 18 తేదీల్లో ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, రద్దీకి అనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో అదనపు బస్సులను నడపాలని అధికారులను ఆదేశించారు. దసరా ప్రత్యేక బస్సుల నిర్వహణలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పండుగ ముగిసిన అనంతరం తిరిగి నగరాలకు చేరుకునే ప్రయాణికుల కోసం కూడా ఇదే తరహాలో ప్రత్యేక బస్సు సర్వీసులను సిద్ధం చేయాలని ఆదేశించారు.

​బస్ స్టేషన్లలో తాగునీరు, విశ్రాంతి వసతులు, పారిశుధ్యం మరియు భద్రత విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఎండీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. ప్రయాణికులు తమ ముందస్తు రిజర్వేషన్లను అధికారిక వెబ్‌సైట్ www.tgsrtcbus.in ద్వారా బుక్ చేసుకోవాలని కోరారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు వివరాల కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 లను సంప్రదించాలని సూచించారు. ప్రయాణికులందరూ టీజీఎస్ఆర్టీసీ సేవలనే వినియోగించుకుని సురక్షితంగా, ప్రశాంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని వై.నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →